ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ సూసైడ్ వెనుక కారణం అదేనా ?

-

ఈ రోజు ఉదయం ప్రముఖ బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకుని మరణించిన వార్త సినీ పరిశ్రమలను కన్నీరు పెట్టించింది. కళామతల్లిని నమ్ముకుని వచ్చిన నితిన్ దేశాయ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు మరియు ఇండస్ట్రీ ప్రముఖులు శోధిస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం అప్పుల భారమే ఈ బలవన్మరణానికి కారణం అట. వివిధ ఆర్ధిక సంస్థల నుండి రూ. 250 కోట్ల వరకు అప్పులు తీసుకుని తీర్చలేకపోవడం తో వేరే దారిలేక ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారని సందేహిస్తున్నారు. కాగా తాను అప్పుల్లో ఉన్న విషయాన్ని కొన్ని రోజులకు ముందు ఖలాపూర్ ఎమ్మెల్యే మహేష్ కు చెప్పాడట. అయితే అన్ని కూడా అనుమానాలుగా ఉన్నాయి.. మరణానికి సంబంధించి బలమైన కారణం ఏమిటన్నది ఇంకా ఆధారాలతో సహా తెలియలేదు.

కానీ దేశాయ్ ఆత్మహత్యకు పాల్పడిన గదిలో ఒక ఆడియో రికార్డింగ్ దొరికిందని పోలీసులు తెలిపారు.. ఈ ఆడియో రికార్డింగ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని చూస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version