మీ బంధంలో రొమాన్స్ లేకపోతే ఆడవాళ్ళలో కలిగే అనుమానాలేంటో తెలుసా?

-

రొమాన్స్.. మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత దృఢంగా ఉంచుతుంది. భార్య భర్తల మధ్య సంబంధాన్ని గట్టి పరిచి కలకాలం కలిసి ఉండేందుకు సాయపడుతుంది. కానీ పెళ్ళైన కొన్ని సంవత్సరాలకు భార్య భర్తల్లో ఈ రొమాన్స్ తగ్గిపోతుంది. మొదట్లో చిన్ని, బంగారం అని ముద్దుగా పిలుచుకుని, బోలెడంత ప్రేమను ఒలకబోస్తూ, ప్రపంచంలో ఉన్న ప్రతీదీ తీసుకొచ్చేవారిలా చూసుకుంటారు. ఖరీదైన బహుమతులతో అందలం ఎక్కిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అసలు కథ మొదలవుతుంది.

జీవితంలో రొమాన్స్ తగ్గిపోతుంది. ఊరికే కోపమొస్తుంది. అప్పటివరకూ తమ తప్పు లేకపోయినా సారీ చెప్పిన వారు తాము తప్పు చేస్తున్నామని తెలిసినా సారీ చెప్పరు. రొమాన్స్ మిస్ అవుతుంది. ఇలాంటప్పుడే ఆడవాళ్ళకు అనేక అనుమానాలు కలుగుతాయి.

రొమాన్స్ తగ్గినపుడు ఆడవాళ్లలో కలిగే అనుమానాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

అభద్రతా భావం పెరుగుతుంది

శృంగార పరంగా కూడా పెద్దగా రొమాన్స్ ఇవ్వని భర్తలపై అభద్రతా భావం పెరుగుతుంది. అనవసర అఫైర్స్ పెట్టుకున్నారేమోనన్న అనుమానం కలుగుతుంది. తన మీద ప్రేమ వేరే వాళ్ళకి షిఫ్ట్ చేసారేమో అనిపిస్తుంది.

నమ్మకం కోల్పోవడం

తనను ఇంప్రెస్ చేయడానికి చిన్న పని కూడా చేయడం లేదన్న ఆలోచన భార్యకి వచ్చినపుడు భర్త మీద నమ్మకం తగ్గిపోవడం మొదలవుతుంది. ఇతరుల పట్ల ఆకర్షితులు కావడం వల్లే నన్ను పట్టించుకోవట్లేదన్న భావం పెరుగుతుంది. దానివల్ల భర్త మీద నమ్మకమ్ తగ్గుతుంది.

కోపం పెరుగుతుంది

మోసం చేస్తున్నాడన్న భావన పెరిగి, పెరిగి ఒకానొక రోజు కట్టలు తెంచుకుంటుంది. అలాంటప్పుడు వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. అందుకే జీవితంలో పక్కనున్న వారిని పట్టించుకోవాలి. పక్కనే ఉన్నారు కదా అని పట్టించుకోకుండా ఉంటే పరిష్కారాలు లేని సమస్యలు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version