రెండు పరోటాల తింటే లక్ష రూపాయల బహుమతి ఇస్తారట..! కానీ ఎవరూ తినలేరు

-

పరోటాలు తింటాం కానీ..ఇడ్లీదోశలు తిన్నట్లు పరోటాలు తినలేరు..ఒక ప్లేట్ తినేసిరికే బొజ్జ నిండిపోతుంది. కానీ కొంతమంది అయితే..పరోటాలను ఇష్టంగా బాగా ఎక్కువగానే తింటారు. రెండు పరోటాలు తింటే లక్షరూపాయల బహుమతి ఇస్తారట. అరే రెండే కదా లాగించేద్దాం అనుకుంటున్నారా..అంత ఈజీ కాదుగా..

జైపూర్‌లో 32 అంగుళాల రెండు పరోటాలను గంటలో తింటే లక్ష రూపాయల బహుమతి ఆఫర్ చేశారు. ఇది మాత్రమే కాదు ఈ ఫీట్ సాధిస్తే మీకు ఇక్కడ జీవితాంతం పరోటా ఉచితంగా ఇస్తారట… జైపూర్‌లోని న్యూ సంగనేర్ రోడ్‌లో జైపూర్ పరోటా జంక్షన్ పేరుతో ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ 32-అంగుళాల పరోటా ఉంటుంది..ఇది 4 వేర్వేరు పరిమాణాలలో దొరుకుతుంది.

Zomato వెబ్‌సైట్ ప్రకారం.. జైపూర్ పరోటా రెస్టారెంట్‌లో 72 రకాలకు పైగా 32 అంగుళాల పరోటాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బంగాళాదుంప, ఉల్లిపాయ, పనీర్‌తో సహా అనేక రకాల్లో ఉంది…ఇది రెగ్యులర్, మీడియం, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ అనే 4 సైజులలో లభిస్తుంది.

తయారీ విధానం

5 అడుగుల పాన్‌: ఈ పరోటా సిద్ధం చేయడం అంత సులభం కాదు. దీని తయారీకి 5 అడుగుల పాన్ కావలట… ఇందుకోసం వారు ప్రత్యేకంగా తయారు చేశారు. పరోటాను రోలింగ్ చేయడానికి ప్రత్యేక రోలింగ్ పిన్ తయారు చేశారు. 32 అంగుళాల పరోటాలను రోల్ చేయడానికి 40 అంగుళాల పొడవు గల రోలింగ్ పిన్ ఉపయోగిస్తారు. ఈ రుచికరమైన పరోటాను తయారు చేయడానికి 20 రకాల మసాలాలు ఉపయోగిస్తారు. ఇవి రుచిని పెంచే ప్రత్యేక మసాలాలట. ఒక పరోటా కోసం రెండు కిలోల పిండి, 1.5 కిలోల సగ్గుబియ్యం ఉపయోగిస్తారు. బంగాళదుంపలు, మసాలాలతో తయారు చేసిన సగ్గుబియ్యాన్ని రెండు కిలోల పిండిలో నింపి రోల్ చేయడం అంత సులభం కాదు.

ఈ ఒక్క పరోటాని నలుగురు సులభంగా తినవచ్చు. కట్ చేసిన తర్వాత బాహుబలి ప్లేట్‌లో సాస్, గ్రీన్ చట్నీ, వెల్లుల్లి చట్నీతో సర్వ్ చేస్తారు. ఇది మరింత రుచికరంగా ఉంటుంది. ఎప్పుడైనా..జైపూర్ వెళ్తే..ఈ పరోటా సవాల్ ను ట్రై చేసి చూడండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version