బిర్యానీ.. ఈ పేరు వింటూనే నోట్లో నీళ్లూరిపోతాయి. అబ్బా బిర్యానీ..ఆ స్మెల్.. మటన్ పీస్‌లు వేడి వేడిగా తింటుంటే భలే ఉంటుంది కదా..! ఎంత మసాలాలు వేసి వండినా..బాస్మతి రైస్ వేయకపోతే.. లుక్ బాగుండదు..ఆ టేస్ట్ కూడా రాదు. బిర్యానీ తినాలని అనిపించిన ప్రతిసారి..బాస్మతి రైస్‌తోనే చేసుకోలేం.. ఖరీదు ఎక్కువ.. అందరం కొనుక్కోలేం.. అలాంటి వారికి బాస్మతిలాంటి ఫ్లేవర్‌ను అందించే ఆకులు ఉన్నాయి. అవే పాండన్ ఆకులు. వీటిని ‘అన్నపూర్ణ ఆకులు’ అని కూడా పిలుస్తారు.. సౌత్ ఈస్ట్ ఏషియన్ వంటకాల్లో ఈ ఆకులు ప్రాచుర్యం పొందాయి. ఈరోజు ఈ ఆకుల ప్రత్యేకత ఏంటో చూద్దాం!
పాండన్ ఆకులు సహజంగానే సువాసనను కలిగి ఉంటాయి. అందుకే ప్రముఖ బ్రిటీష్ రచయిత్రి .. ఈ ఆకులను పానీయాలు, జెల్లీల తయారీలో కూడా వాడతారు. ‘ఆగ్రో ఫుడ్ ఇండస్ట్రీ హై టెక్’ అనే పుస్తకంలో ప్రచురించిన కథనం ప్రకారం.. ఈ పాండన్ ఆకులపై ఓ అధ్యయనం సాగింది. ఈ అధ్యయనంలో ఆకుల్లో బాస్కతి బియ్యానికి చెందిన ఫ్లేవర్ కూడా ఉన్నట్టు తెలిపారు.. వీటిని బియ్యం భద్రపరిచే డబ్బాల్లో వేస్తే వీటి సువాసన ఆ బియ్యానికి అంటుకుంటుందట.. అన్నం ఉడుకుతున్నప్పుడు దాదాపు 70 శాతం ఉడికేశాక ఈ ఆకులను శుభ్రంగా కడిగి అన్నం గిన్నెలో వేస్తే చాలు.. బాస్మతి బియ్యంలా వాసన ఘుమఘుమలాడిపోతుందట. సాధారణ బియ్యంతో బిర్యానీ వండినా కూడా ఈ పాండన్ ఆకులను కలపడం వల్ల అది బాస్మతి బియ్యంతో వండిన బిర్యానీలా అదిరిపోతుంది.
పోషకాలు పుష్కలంగా..
తినే ముందు ఈ ఆకులను తీసి పడేయాలి. అన్నం ఉడుకుతున్నప్పుడే వీటిని వేయడం వల్ల ఇందులో ఉండే సుగుణాలన్నీ అన్నంలోకి వెళ్తాయి.. గ్లైకోసైడ్లు ఆల్కలాయిడ్స్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు కూడా అధికంగా ఉన్నాయి. ఈ ఆకులలో ఉండే పోషకాహారం కారణంగా.. ఈ ఆకులను సాంప్రదాయకంగా నొప్పి, జ్వరాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. మలబద్ధకం చికిత్సకు ఆయుర్వేద మందులలో ఈ ఆకులను కూడా వాడతారు.
ఇంకా ఎన్నో ప్రయోజనాలు..
అనేక చర్మ సమస్యలకు చికిత్స చేయవచ్చు. ముఖ్యంగా మొటిమలను నివారిస్తుంది.
కాలిన గాయాలు, మచ్చలను పోగొడుతుంది. చర్మ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నిరోధిస్తుంది.
గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడంలో కూడా ఇది ముందుంటుంది.
మధుమేహం ఉన్న వారికి ఈ ఆకులు ఎంతో మేలుచేస్తాయి..
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉండేట్టు చూస్తాయి.