మహాభారతంలో శకునికి తాలిబాన్ల ఆఫ్ఘనిస్తాన్‌తో సంబంధం ఉందా..?

-

మహాభారతం గురించి తెలిసిన వాళ్లకు శకుని గురించి తెలియకుండా ఉండదు. కథలో కీలకపాత్ర శకునిదే. కౌరువులకు మేనమానగా వారి పక్కనే ఉంటూ కుటిలమైన ఆలోచనలతో వాళ్లను అధర్మ మార్గాన నడిచేలా చేశాడు. శకుని చాకచక్యం వల్ల కథలో ఎన్నో మలుపులు తిరుగుతాయి. కానీ కౌరవులు ఈ యుద్ధంలో ఓడిపోతారని శకునికి తెలుసు. అయినప్పటికీ అతను తన ప్రతీకారం తీర్చుకోవడానికి తన సోదరి కుటుంబాన్ని నాశనం చేశాడు. ఈ మహాభారత విలన్‌కి నేటి తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌తో సంబంధం ఉంది తెలుసా..?

ఆఫ్ఘనిస్తాన్‌తో శకుని సంబంధం

గాంధార (ఆధునిక కాందహార్) రాజ్యానికి రాజు శకుని. కాందహార్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంది. మహాభారత కాలంలో గాంధారం ఒక శక్తివంతమైన రాజ్యం. ప్రస్తుతం, ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌ను తాలిబాన్‌లకు బలమైన కోటగా పరిగణిస్తున్నారు. ఇక్కడ తాలిబన్ల పాలన సాగుతోంది. కాందహార్ విమాన హైజాక్‌లో పాల్గొన్న తాలిబాన్ వ్యవస్థాపకుడు మౌలానా ముల్లా ఒమర్ కూడా కాందహార్‌లోనే జన్మించాడు. కాందహార్ 90లలో జరిగిన రెండు సంఘటనలకు ప్రసిద్ధి చెందింది. వాటిలో ఒకటి తాలిబాన్ల పెరుగుదల మరియు మరొకటి కాందహార్‌కు భారత విమానాన్ని హైజాక్ చేయడం.

మహాభారత సూత్రధారి అయిన శకుని గాంధారి సోదరుడు, అంటే కౌరవుల మేనమామ. దుర్యోధనుడి దుష్ట విధానాల వెనుక శకుని ఉన్నాడు. హస్తినాపుర రాజు ధృతరాష్ట్రుడి ద్వారా తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని శకుని కోరుకున్నాడు. అందువలన అతను కౌరవులు మరియు పాండవులు తమలో తాము పోరాడేలా చేశాడు.

శకుని ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు?

శకునికి తన చెల్లెలు గాంధారి అంధుడైన ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. భీష్ముని ఒత్తిడితో గాంధారి ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకోవలసి వచ్చింది. గాంధారి పెళ్లి తర్వాత తను కూడా అంధురాలు అవ్వాలని కళ్లకు గంతలు కట్టుకుంటుంది. ఇది అదు ధృతరాష్ట్రుడికి, శకునికి నచ్చదు. తన ముద్దుల చెల్లలి జీవితం అంతా ఇలా అంధకారంలోకి వెళ్లడం తట్టుకోలేక మొత్తం హస్తినాపురాన్నే నాశనం చేయాలి అనుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version