రేవంత్ సర్కార్‌కు చుక్కెదురు అయింది. కంచె గచ్చిబౌలి చెట్ల నరికివేత అంశం సుప్రీం కోర్టుకు చేరింది. చెట్లు నరికేసిన స్థలాన్ని పరిశీలించి ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల వరకు రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఆదేశాలించింది అత్యున్నత ధర్మాసనం.
ఇక తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చెట్లు కొట్టేయకుండా చూసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా HCU వివాదంపై కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. మూడేళ్లలో అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాల భూమిని అతిపెద్ద ఈకో పార్క్ లాగా మారుస్తామని వెల్లడించారు. ఆ 400 ఎకరాల భూమిలో ఎవరు ఇంచు కొనుకున్నా తిరిగి వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు కేటీఆర్. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అన్నారు. ప్రజల భూమికి నువ్వు కేవలం ధర్మకర్తవు మాత్రమే.. దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే కుదరదు అని చెప్పారు కేటీఆర్.