జీవితంలో ఒక్కసారైనా పోలీస్ స్టేషన్ మెట్లు, ఆసుపత్రి మెట్లు ఎక్కకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒక పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుంది. కానీ ఎవరైనా జైలుకూడు తినాలనుకుంటారా..? కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు.. జైలులో ఫుడ్ అంటే ఏం బాగుండదు, దుర్వాసన వస్తుంది. ఎప్పుడూ ఆ పప్పు, సాంబార్ పెడతారు అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు జైలు ఫుడ్‌ను కూడా ఆర్డర్ చేసుకుని తినొచ్చా.. ఇదేమైనా.. స్విగ్గి, జోమాటాలో బిర్యానియా భయ్యా పోయి పోయి జైలు ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుని తింటానికి అనుకుంటున్నారా..?
సాధారణ వ్యక్తులు కూడా ఇక నుంచి జైలు ఫుడ్ తినే విధంగా త్వరలోనే క్యాంటీన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆన్‌లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా మంది బయట ఉండే రెస్టారెంట్స్‌లో లభించే ఫుండ్స్ తింటూ ఉంటారు. అయితే ఫుడ్ రివ్యూస్ చేసేవారు కొత్తగా ట్రై చేస్తు ఉంటారు. ఇలాంటి వారికోసం మేము జైలు ఫుడ్ పరిచయం చేయబోతున్నాం. జైలులోశిక్ష అనుభవించేవారు తినే ఫుడ్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే ఈ ఫుడ్ తప్పకుండా ట్రై చేయాల్సిందే. కాన్పూర్ మేజిస్ట్రేట్ కొత్త ఆలోచన ఇది.. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జైలులో ఉండే ఖైదీలతో రుచికరమైన ఆహారాలు తయారు చేసి క్యాంటిన్‌లో బయటవారికి విక్రయించేందుకు కాన్పూర్ మెజిస్ట్రేట్ సన్నాహాలు చేస్తోంది.
ఇలా ఖైదీలకు తయారు చేసిన ఆహారాలు చాలా తక్కువ ధరలకే విక్రయించేందుకు అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా జైలర్లను చూసేందుకు వచ్చే కుటుంబ సభ్యులకు ఉంచితంగా ఈ ఆహారాలను అందించబోతునట్లు మాచారం. కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ చోరవతో అతి త్వరలోనే ఓ ఫుడ్ కౌంటర్‌ను కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అధికారులు జైలు గేటు బయట ఫుడ్ కౌంటర్‌ను కూడా చేపించబోతున్నారట. ఇదే సంవత్సరంలో ఆగస్టు నుంచి జైలు ఫుడ్ అందరికీ లభించేలా సన్నాహాలు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఫుడ్స్ ఐటమ్స్ కానీ, వాటీ ధరలకు సంబంధించిన వివరాలు ఇంకా వివరించలేదు. త్వరలోనే వీటిని సంబంధించి సమాచారాన్ని కూడా అందిస్తామని ఆధికారులు తెలిపారు. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేకునే విధంగా అన్ని రకాల సౌకర్యలతో ఈ క్యాంటీన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు.