కితకితల చెట్టు.. ముట్టుకుంటే నవ్వుతుంది.. సైగ చేస్తే స్పందిస్తుందట..!

-

సాధారణంగా మనుషులకు చక్కిలిగింతలు ఉంటాయి. అందులోనూ కొందరికి అసలే ఉండవు. సీరియస్ సింహాలు. కానీ చెట్లకు చక్కిలిగింతలు ఉండటం మీరెప్పుడైన విన్నారా..అవునండీ ఆ చెట్టుకు చక్కిలిగింతలు ఉన్నాయట. ముట్టుకుంటే ఓ హోయలుపోతుంది. అదే పనిగా ఊగుతుంది.

ప్రపంచంలో 3 లక్షల కోట్లకు పైగా చెట్లు ఉన్నాయి. వాటిలో చాలా చెట్ల గురించి మనకు తెలియదు. ముఖ్యంగా కితకితల చెట్టు గురించి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ చెట్లు మన ఇండియాలో కూడా ఉన్నాయట. టచ్ మి నాట్ మొక్కల ఆకుల్ని మనం ముట్టుకుంటే అవి ఎలా అయితే ముడుచుకుపోతాయి. అలాగే… కితకితల చెట్టును మనం నిమిరితే… అది నవ్వుతుందట. మనం నవ్వినప్పుడు సౌండ్ వస్తుంది గానీ అది చెట్టు కదా… అది నవ్వినప్పుడు సౌండ్ రాదు. తనకు కితకితలు పెట్టొద్దు అన్నట్లుగా ఆ చెట్టు అటూ ఇటూ కదులుతుంది. దాని ఆకులు, కొమ్మలు చిన్నగా కదులుతాయి. అదే దాని ప్రత్యేకత.

ఈ చెట్లు ఉత్తర భారత దేశంలో అక్కడక్కడా ఉంటాయట. వాటిని స్థానికులు గుద్గుదీ అంటే కితకితల చెట్టు అని అంటారు. గాలి వచ్చినప్పుడు చెట్లు ఊగటం కామన్..కాబట్టి గాలి రానప్పుడు ఈ చెట్టుకి చక్కిలిగింతలు పెడితే..అది ఊగుతుంది.

ఇలా ఎందుకు జరుగుతుందంటే..!

ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్ రండియా డ్యుమెటోరమ్ (Randia Dumetorum). ఇది చాలా సున్నితమైన చెట్టు. దీని కాండం నుంచి సెన్సిటివ్ సెన్సార్లు చెట్టు అంతటా ప్రవహిస్తాయట. అందువల్లే ముట్టుకోగానే కొమ్మలు, ఆకులూ ఊగుతాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ చెట్లు అక్కడక్కడా ఉన్నాయి. ఇవి అంతరించిపోతున్న చెట్ల జాతుల్లో ఒక రకం.. వీటిని కాపాడాల్సిన అవసరం ఉన్నా అక్కడి ప్రభుత్వాలు అలాంటి చర్యలేవీ తీసుకోవట్లేదు. యూపీలోని కటార్నియాఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఇవి 5 చెట్లు ఉండేవి. వాటిలో 2 చనిపోగా… 3 మిగిలివున్నాయి. అవి పర్యాటకులకు ఆనందం, ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

సైగలకు స్పందిస్తాయి కూడా:

గడ్డి మైదానాల్లో పెరగగలిగే ఈ చెట్లు చాలా సున్నితమైనవి అని మొదటిసారిగా శాస్త్రవేత్త జెస్సే బోస్ కనిపెట్టారు. “మనుషుల సైగలను బట్టి కూడా ఈ చెట్లు స్పందిస్తాయట. కానీ మనం ఆ స్పందనలను చూడలేం” అని జెస్సే బోస్ తెలిపినట్లుగా కటార్నియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ DFO యశ్వంత్ వెల్లడించారు.

ఈ చెట్ల సంఖ్యను పెంచడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా కుదరట్లేదట. యశ్వంత్ ఎన్నోసార్లు ఈ చెట్టు గింజలు, కాండాలను పాతిపెట్టి… కొత్త మొక్కలు వచ్చేలా ప్రయత్నించారట..కానీ ఫలితం రాలేదు అంటున్నారు.. ఇప్పుడు గ్రాఫ్టింగ్ విధానంలో కొత్త మొక్కలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొత్తానికి ఈ వెరైటీ చెట్లు అంతరించపోకుండా ఉంటే చాలా బాగుంటుంది కదూ..అన్ని చెట్లకు ప్రాణం ఉంది. కానీ అవి చూపించుకోలేవు. జీవం ఉందికాబట్టే అలా పెరుగుతాయి. కానీ ఈ చెట్లు స్పందించటం అక్కడి వారిని ఆశ్యర్యానికి గురిచేసే విషయమే కదూ. దీనికి సంబంధించి వీడియోను మీరు ఈ లింక్ ద్వారా చూడొచ్చు

Read more RELATED
Recommended to you

Exit mobile version