మేజ‌ర్‌ రివ్యూ : సందీప్ ఉన్నికృష్ణ‌న్ కి నివాళి

-

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమా శుక్రవారం విడుదలైంది. పాజిటివ్ టాక్ తో ఈ ఫిల్మ్ దూసుకుపోతున్నది.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.” గూడచారి” ఫెమ్ శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

స్టోరీ : చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని తపనతో బతుకుతూ ఉంటాడు సందీప్ ఉన్ని కృష్ణన్ (అడవి శేషు). అమ్మ అ రేవతి అలాగే నాన్న ప్రకాష్ రాజ్ అంటే అతనికి ప్రాణం. వారిద్దరికీ సందీప్ సైన్యంలో చేయడం ఇష్టం ఉండదు. అయినప్పటికీ సైన్యంలో చేరాలని అనుకు oటాడు సందీప్. స్కూల్ రోజుల్లో ఇష్టపడిన నేహా ని పెళ్లి చేసుకుంటాడు. తనకు ఇప్పుడు టైం కేటాయించడం లేదని నేహా ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వారి మధ్య విభేదాలు మొదలవుతాయి. ఇలాంటి తరుణంలోనే సైన్యంలో శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు సందీప్. అదేసమయంలో ముంబైలో ఉగ్రదాడి జరుగుతుంది. ఉగ్రం ఒక ఆట కట్టించడానికి మేజర్ సందీప్ కూడా బరిలోకి దిగుతాడు. ఈ పోరులో మేజర్ ఏం చేశాడు ? ఉగ్రవాదులను ఎలా మట్టికరిపించాడు అన్నది మేజర్ సినిమా కథ.

అనాలసిస్ : మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అంటే.. ముంబైలో జరిగిన దాడులే గుర్తుకువస్తాయి. సందీప్ బాల్యం ఎలా గడిచింది ? ఆర్మీలో చేరాలని నా ఆలోచన అతనికి ఎలా వచ్చింది? యవ్వనంలో ఉన్న ప్రేమ కథ ఏంటి ? అసలు అతడు ఆర్మీలో చేరాలని ఇంట్రెస్ట్ కు తల్లిదండ్రులు ఎందుకు అడ్డు చెప్పారు అన్నదే ఈ కథాంశం. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. ద్వితీయార్థం మొత్తం ముంబై ఆపరేషనే. అందులో మేజర్ వ్యూహాలు అలాగే చావుకు ఎదురెళ్లి… శత్రువుల పై పోరాడిన వైనం… ఇవన్నీ త్రిల్లింగ్ గా ఉంటాయి. ఇప్పటికే ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో కొన్ని సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు వచ్చాయి. అయినా సరే ఆయా సన్నివేశాలను ఉద్వేగ భరితంగా చూపించగలిగాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్.. హీరో అడవి శేషు యాక్టింగ్ చాలా బాగుంది. సినిమా మొత్తం అడవి శేషు యాక్టింగే కనిపిస్తుంది.

Rating : 3/5

Read more RELATED
Recommended to you

Exit mobile version