లాంఛ్‌ Vivo G2 బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ ఇవే

-

స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ సంస్థ వీవో నుంచి కొత్త ఫోన్‌ చైనాలో లాంచ్‌ అయింది. వివో జీ2 పేరుతో ఫోన్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. బడ్జెట్‌లో ఫోన్‌ కొనాలంటే.. వీవో మంచి ఎంపిక.. ఇప్పుడు ఈ ఫోన్‌ కూడా అంతే.! ఫోన్‌ ఫీచర్స్‌, స్పెసిఫికేషన్స్‌ ఎలా ఉన్నాయో చూద్దాం.!

వివో జీ2 ఫీచర్స్​ ఇవే..

వివో జీ2లో 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.56 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది.
దీని స్క్రీన్​ టు బాడీ రేషియో 89.67శాతం.
ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్​ ఉంది.
5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 15వాట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ దీనికి లభిస్తోంది.
ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ వివో స్మార్ట్​ఫోన్​.. ఆండ్రాయిడ్​ 13 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 3 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది.
ఈ వివో జీ2లో డ్యూయెల్​ నానో సిమ్​ ఉంటుంది.
ఇక ఈ మొబైల్​లో 13ఎంపీ రేర్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 5 ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది. కెమెరా ఫీచర్స్​ చూస్తే చాలు.. ఇది పర్ఫెక్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ అని తెలిసిపోతుంది!
వివో జీ2 ఒక 5జీ స్మార్ట్​ఫోన్​. ఇందులో 5జీతో పాటు 4జీ ఎల్​టీఈ, వైఫై-5, బ్లూటూత్​ 5.1, జీపీఎస్​, యూఎస్​బీ టైప్​ సీ పోర్ట్​, 3.5ఎంఎం ఆడియో జాక్​ వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ ఉన్నాయి. యాక్సెలరోమీటర్​, యాంబియెంట్​ లైట్​ సెన్సార్​, ప్రాక్సిమిటీ సెన్సార్​, ఈ-కంపాస్​, ఫ్లికర్​ సెన్సార్​లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ వివో జీ2 స్మార్ట్​ఫోన్​ మెజర్​మెంట్స్​.. 165.74×75.43×8.09ఎంఎం. బరువు 186గ్రాములు.

వివో జీ2 ధర ఎంతంటే

వీవో జీ2 4జీ ర్యామ్​- 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర 1,199 యువాన్​లు. అంటే సుమారు రూ. 14వేలు.
6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర 1,499 యువాన్​లు. అంటే సుమారు రూ. 17,500.
ఇక 8జీబీ ర్యామ్​- 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర 1,599 యువాన్​లు. అంటే సుమారు రూ. 18,700.
8జీబీ ర్యామ్​- 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర 1,899 యువాన్​లు. అంటే సుమారు రూ. 22వేలు.
ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ వివో జీ2 స్మార్ట్​ఫోన్​ ఇండియా లాంచ్​పై ఇంకా క్లారిటీ లేదు. దీనిపై సంస్థ త్వరలో ప్రకటన చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version