కొత్త స్కూటీ.. కానీ చెప్పుకోలేని సమస్య వల్ల వాడలేకపోతుంది ఓ అమ్మాయి.. ఏంటంటే

-

కొత్త వాహనాలు కొన్నప్పుడు ఆ నంబర్ చాలా మంది డబ్బులిచ్చి వాళ్లకు నచ్చిన సిరీస్ వచ్చేలా చేసుకుంటారు. మరికొందరు ఏది వస్తే అదేలే అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే సమస్య వేరే ఉంది. దీపావళికి గిఫ్ట్ గా కూతురికి స్కూటి ఇచ్చాడు ఓ తండ్రి. పాపం ఆ అమ్మాయి దాన్ని ఎంతో ఇష్టంగా వాడదం అనుకుంది.. కానీ చెప్పుకోలేని సమస్య వల్ల అసలు అది బయటకు కూడా తీయలేకపోతుంది. ఇంతకీ ఆ సమస్య ఏంటంటే..

ఢిల్లీలో ఓ అమ్మాయికి ఎదురైన సమస్య అక్కడి RTO అధికారులను కూడా చిక్కుల్లో పడేసింది. తన కొత్త స్కూటీకి RTO అధికారులు ఇచ్చిన నంబర్ వల్లే ఈ సమస్య. బండి నంబర్లలో ఉండే ఇంగ్లీష్ లెటర్స్.. ఆ అమ్మాయికి స్కూటీని నడపలేని పరిస్థితి తెచ్చాయి

నంబర్ ప్లేట్ లో లెటర్స్ ఎలా ఫామ్ చేస్తారు..

ఢిల్లీలో టూవీలర్లకు S అనే ఇంగ్లీష్ లెటర్ ఉంటుంది. జనరల్‌గా నంబర్ ప్లేటులో ముందు అక్షరాలు DL అని ఉంటాయి. అవి ఢిల్లీకి సింబల్. నెక్ట్స్ జిల్లా నంబర్ ఉంటుంది. తర్వాత వెహికిల్ ఎలాంటిది అన్న దాన్ని బట్టీ ఓ ఇంగ్లీష్ లెటర్ ఉంటుంది. దాని తర్వాత మరో 2 ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి. అవి లేటెస్ట్ సిరీస్‌కి సంబంధించినవి. ఆ తర్వాత 4 నంబర్లతో సిరీస్ ఉంటుంది. అంటే ఉదాహరణకు DL 2 C SD 6939 అని అనుకుందాం..ఇందులో DL ఢిల్లీ కాగా… 2 అనేది తూర్పు జిల్లాకు చెందినది. ఇక C అనేది కారుకు గుర్తు. అదే 2వీలర్ అయితే S ఇస్తారు. SD అనేది నంబర్ సిరీస్. ఆ తర్వాత నంబర్ ఉంటుంది.

ఆ అమ్మాయికి సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆమెది స్కూటీ. కాబట్టీ నంబర్ ప్లేటులో S వచ్చింది. ఆ తర్వాత నంబర్ సిరీస్‌లో భాగంగా EX వచ్చింది. అందువల్ల నంబర్ ప్లేటుపై SEX అని వచ్చింది. ఇలాంటి నంబర్ సిరీస్ రావడంతో ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నారు. పాపం అమ్మాయి స్కూటీని నడపలేకపోతోంది. అసలు ఇలాంటి నంబర్ సిరీస్ ఎలా ఇచ్చారని అధికారులను తప్పుపడుతున్నారు.

దీపావళికి గిఫ్ట్ గా ఇచ్చిన స్కూటిని ఆ అమ్మాయి ఇంత వరకూ వాడనేలేదు. ఇంట్లోంచీ బయటకు తియ్యలేదు. కారణం నంబర్ ప్లేటుపై SEX అనే అక్షరాలు కనిపిస్తూ ఉండటమే. దీనిపై ఆర్టీఓ అధికారుల చుట్టూ తిరుగుతున్నా లాభం లేదట. మరో నంబర్ ఇవ్వమని అడుగుతున్నా వారు ఇవ్వట్లేదనీ విసుకుంటున్నారని బాధితురాలు ఆవేదన చెందుతుంది. ఈ సమస్య కేవలం ఈ అమ్మాయికి మాత్రమే వచ్చిన సమస్య కాదు. ఆ సిరీస్‌లో టూ వీలర్లు కొన్న అందరికీ వస్తుందట.. RTO అధికారులు అసలు అలాంటి సిరీస్‌నే తొలగించడం మేలంటున్నారు నెటిజన్లు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version