ఇక‌పై నోయిడాలో మెట్రోరైల్‌లో పార్టీలు చేసుకోవ‌చ్చు..!

బ‌ర్త్ డే పార్టీలు లేదా ఇత‌ర ఏ సంద‌ర్భానికి చెందిన పార్టీల‌నైనా స‌రే కొంద‌రు ఇండ్ల‌లో జ‌రుపుకుంటారు. కొంద‌రు రెస్టారెంట్లు, హోట‌ల్స్‌, రిసార్ట్స్‌లో జ‌రుపుకుంటారు. ఇంకా కొంద‌రు ఫంక్ష‌న్ హాల్స్‌ను ఆశ్ర‌యిస్తుంటారు. అయితే ఇక‌పై నోయిడాలో మాత్రం ఏకంగా మెట్రో రైల్‌లోనే పార్టీలు జ‌రుపుకోవ‌చ్చు. అవును, మీరు విన్నది నిజ‌మే. నోయిడా మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఈ సరికొత్త ఆఫ‌ర్‌ను ప్ర‌యాణికుల‌కు అందిస్తోంది.

now you can book noida metro rail coaches for parties

నోయిడాలో ఇక‌పై ప్ర‌యాణికులు త‌మ పార్టీల‌కు గాను మెట్రో రైల్ కోచ్‌ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు. 1 గంట‌కు ఒక కోచ్ అద్దె రూ.5వేల నుంచి రూ.10వేల వ‌ర‌కు ఉంటుంది. ఒక కోచ్‌లో చిన్నారులు, పెద్ద‌ల‌ను క‌లిపి కేవ‌లం 50 మందిని మాత్ర‌మే అనుమ‌తిస్తారు. ఇక ర‌న్నింగ్ కోచ్‌లు కావాల‌నుకుంటే ప‌గ‌టివేళ‌లో ఎప్పుడైనా బుక్ చేసుకోవ‌చ్చు. అదే ఆగి ఉన్న కోచ్ కావాలంటే రాత్రి 11 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు కోచ్‌ల‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

కాగా నోయిడా మెట్రో రైల్ కోచ్‌ల‌ను పార్టీలు చేసుకునేందుకు అద్దెకు తీసుకోద‌లిస్తే క‌నీసం 15 రోజుల ముందైనా అప్ల‌యి చేసుకోవాలి. అలాగే ఒక అప్లికేష‌న్‌కు 4 కోచ్‌ల‌ను మాత్ర‌మే బుక్ చేసుకునేందుకు వీలు క‌ల్పిస్తారు. కోచ్‌ల‌లో పార్టీలు జ‌రుపుకునే స‌మ‌యంలో రైల్వే సిబ్బంది కూడా ఉంటారు. ఈ క్ర‌మంలో కోచ్ మ‌ధ్య‌లో టేబుల్స్‌, డ‌స్ట్ బిన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా ప్ర‌యాణికుల పార్టీల కోసం మెట్రో రైల్ కోచ్‌ల‌లో అన్ని స‌దుపాయాల‌ను క‌ల్పిస్తారు. మ‌రింకెందుకాల‌స్యం.. ర‌న్నింగ్ ట్రెయిన్‌లో పార్టీ చేసుకోవాల‌నుకుంటే వెంట‌నే నోయిడా వెళ్లి రండి మ‌రి..!