ఒక రోజు అమ్మాయిలా, ఒకరోజు అబ్బాయిలా…!

-

ఉంటే అమ్మాయి గా ఉండాలి లేదా అబ్బాయిగా ఉండాలి. లేదా ట్రాన్స్ జెండర్ గా అయినా ఉండాలి. కాని విదేశాల్లో ఇప్పుడు చాలా మంది ఒక రోజు అమ్మాయిగా ఒక రోజు అబ్బాయిగా ఉంటున్నారు. వారికీ అబ్బాయిగా బోర్ కొడితే అమ్మాయిగా, అమ్మాయిగా బోర్ కొడితే అబ్బాయిగా ఉంటున్నారు. ఇలా రెండు జెండర్స్‌‌లో జీవించడాన్ని జెండర్ ఫ్లూడిటి అని పిలుస్తూ ఉంటారు.

స్కాట్లాండ్‌లో క్రిస్ ఫియోనా(37), డగ్లాస్(51) అనే జంట వివాహం చేసుకున్నారు. వివాహం సమయంలో క్రిస్ అబ్బాయిగా తయారై వచ్చింది. డగ్లాస్ గే, క్రిస్ జెండర్ ఫ్లూయిడ్. ఒక డేటింగ్ యాప్‌లో వీరు పరిచయం అయి పెళ్లి చేసుకున్నారు. క్రిస్ జెండర్ ఫ్లూయిడ్ కావడంతో తనకు ఎలా కావాలంటే అలా ఉంటుంది. అబ్బాయిగా ఉన్నప్పుడు తనను క్రిస్ లా అని పిలుస్తారని.

అమ్మాయిగా ఉన్నప్పుడు క్రిస్ ఫియోనా అని పిలుస్తున్నారని క్రిస్ లా తెలిపాడు. తాను ఎక్కువగా అమ్మాయిగానే ఉంటున్నా అని క్రిస్ ఫియోనా చెప్పింది. క్రిస్ ఎలా ఉన్నా నాకు ఇష్టమే అని, ఎలా జీవించాలనేది అతడి లేదా ఆమె ఇష్టమని డగ్లాస్ అంటున్నాడు. ఏది ఎలా ఉన్నా ఈ జంట మాత్రం ఆ దేశంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా క్రిస్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version