నీ కక్కుర్తి తగలెయ్యా.. విమానంలో ఇలా షూ ఆరబెట్ట‌డం ఏంటిరా బాబు…!

-

విమానంలో ఓ ప్రయాణికుడు షూ ఆరబెట్టుకోవడానికి చేసిన పని ప్ర‌స్తుతం వైరల్‌గా మారింది. విమానంలో షూ ఆర‌బెట్టుకున్నాడు స‌రే.. ఎలా ఆర‌బెట్టుకున్నాడో తెలుసా..? ఆ ప్ర‌యాణికుడు త‌న షూ ఆరబెట్టుకోవడానికి ఫ్లైట్ వెంటిలేటర్ వాడుకున్నాడు. ఈ ఘటన కెమెరాలో రికార్డు చేసిన మరో పాసింజర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విమానాల్లో ఇలాంటి పనిచేస్తారా ఇది సిగ్గుపడాల్సిన విషయమంటూ పోస్టు చేశాడు. ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఇక అతని షూ తీసి ఆరబెడుతుండగా.. ‘ఏ మాత్రం అవేర్‌నెస్ లేకుండా నాన్‌సెన్స్ చేస్తున్నారు. ప్లీజ్ స్టాప్’ అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో దీని కింద కోపంతో ఎమోజీల కామెంట్లు పెడుతున్నారు కొంద‌రు. ‘ప్రజలు స్వార్థంగా తయారయ్యారు. ఏ మాత్రం సమాజం మీద అవగాహన లేకుండా ఉంటున్నారు. ఇది సీరియస్ గా షాకింగ్ విషయం. ఇలాంటి ఘటన ఎవరైనా చేస్తే అతను ఒప్పుకోగలడా. ప్రత్యేకించి ఓ చిన్న ప్రదేశంలో ఎంతవరకూ సబబు’ అని ఓ యూజర్ ప్ర‌శ్నించాడు. మ‌రికొంద‌రు ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు. మ‌రి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version