అడల్ట్ మోడల్ అయిన పోలీస్‌.. విషయం తెలిసిన ఉన్నతాధికారులు ఏం చేశారంటే..!!

-

ఈ జిందగీని నడిపించేది డబ్బే.. అందరూ బంధాలు, బాంధవ్యాలు అంటారు కానీ మనిషిని శాసించేది మాత్రం డబ్బే.. డబ్బు ఎక్కువైతే మనిషి ప్రవర్తనలో ఆటోమెటిగ్‌గా మార్పులు వస్తాయి.. ఎక్కడో ఒకటి అర ఉంటారు. వాళ్లవల్లే ఇంకా మానవత్వం బతికే ఉందా అనిపిస్తుంది. అయితే డబ్బు మాయలో పడిన ఓ పోలీస్‌ కథ ఇది.. రూల్స్‌ పక్కన పెట్టేసింది.. డబ్బు సంపాదించడమే ముందున్న పని అనుకుంది..
ఆమె పేరు సామ్ హెలెనా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంక్డ్ బార్బీ పేరుతో అకౌంట్ ఉంది. ఒకప్పుడు మహిళా పోలీస్.. ఇప్పుడు అడల్ట్ మోడల్. ఆమెకు సంబంధించిన ఒక వీడియో లీక్ కావడంతో.. పోలీస్ ఉద్యోగాన్ని వదులుకోక తప్పలేదు.
ఓవైపు లండన్‌లో పోలీస్ ఆఫీసర్‌గా చేస్తూనే మరోవైపు అడల్ట్ సైట్ అయిన ఓన్లీఫ్యాన్స్‌లోనూ చేరింది. రెండువైపులా సంపాదిస్తూ.. జల్సా లైఫ్ ఎంజాయ్ చేసింది. తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఓన్లీఫ్యాన్స్ సైట్‌తోపాటూ.. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో కూడా పోస్ట్ చేసేది హెలెనా. స్టేషన్‌లో మాత్రం పోలీస్ లాగా వ్యవహరిస్తూ ఉండేది
2020లో ఓ రోజు ఆఫీసర్లలో ఒకరికి ఆమె వీడియో కంటపడింది. అందులో పోలీస్ డ్రెస్సులో ఉండి.. చేతిలో గొలుసులతో డాన్స్ చేస్తూ కనిపించింది హెలెనా. ఆ వీడియోని చూసిన ఆఫీసర్ మొదట నమ్మలేదు. ఆ తర్వాత వీడియోకి సంబంధించిన టిక్‌టాక్ అకౌంట్ లోకి వెళ్లి చూడగా.. అక్కడ మరిన్ని వీడియోలు కనిపించాయి. దాంతో హెలెనా గురించి పూర్తిగా తెలిసింది.
పై అధికారులు ఆమె ఓన్లీఫ్యాన్స్ అకౌంట్‌ని చెక్ చెయ్యగా అందులో 97 పోస్టులు ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఉండే పోలీస్ జాబ్ చేస్తూ.. తెరవెనక ఇలాంటి పనులు చేయడమేంటని నిలదీశారు. ఆమెను సస్పెండ్ చేశారు. అయితే అప్పటికే ఓన్లీఫ్యాన్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్న హెలెనా.. పోలీస్ జాబ్ ఉంటే ఎంత.. పోతే ఎంతలే అనుకుంది. గుడ్ బై చెప్పి.. పూర్తిగా అడల్ట్ మోడల్ అయిపోయింది.
 ప్రస్తుతం రెండు చేతులా సంపాదించుకుంటూ హెలెనా బాగానే ఉంది. ఐతే.. ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు మెట్రోపాలిటన్ పోలీస్ ప్యానెల్ రెడీ అవుతోంది. త్వరలోనే ఆమె సోషల్ మీడియా అకౌంట్లపై కూడా చర్యలు తీసుకోనున్నారు.నిజానికి ఇలా విదేశాల్లో చాలా మంది ఓన్లీఫ్యాన్స్‌లో చేరి.. తమ కెరీర్‌లను వదులుకుంటున్నారు. డబ్బుంటే చాలు ఇంకేమీ అక్కర్లేదంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version