పెళ్లిల్లో చాలా ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ఒక్కో మతం వాళ్లు ఒక్కో రకంగా పెళ్లి చేసుకుంటారు. కానీ అన్నీ మతాల వారు కామన్‌గా చేసే ఫంక్షన్ మెహందీ ఫంక్షన్.. అసలు ఇప్పుడు ఇది పెళ్లికంటే గ్రాండ్‌గా చేస్తున్నారు. ఆటలు, పాటలు, డ్యాన్సులు అబ్బో.. గోల గోల.. అమ్మాయిలంతా కలిసి మెహిందీ పెట్టుకుని.. పెళ్లికూతురికి కూడా మంచి మంచి డిజైన్స్‌తో మెహిందీ పెడతారు. ఇదంతా చాలా బాగుంటుంది. కెమెరామెన్స్ ఈ ప్రాసెస్‌ను అంతా వాళ్ల కమెరాల్లో బంధీస్తారు. పెళ్లికి ముందు మెహందీ ఎందుకు పెట్టుకుంటారు..? కేవలం అందం, వినోదం కోసమే అనుకుంటున్నారు కదా.।! అసలు పెళ్లికి ముందు మెహందీ పెట్టడానికి అసలు కారణం వేరే ఉంది..? అదేంటంటే..
మెహందీలో ఉండే అద్భుతమైన గుణాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. నరాలని చల్లగా మార్చేసే శక్తి వీటికి ఉంది టెన్షన్‌ని కూడా దూరం చేస్తుందట. మెహందీ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరుపుతారు. రెండు చేతులకి రెండు కాళ్ళకి వధువుకి గోరింటాకు పెడతారు. పైగా వధువు తాలూకా వాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా ఆడపిల్లలు అందరూ కూడా రెండు చేతులకి గోరింటాకు పెట్టుకొని ఫోటోలకి ఫోజులిస్తున్నారు
పాటలు పెట్టుకుని డాన్స్‌లు కూడా వేస్తున్నారు అయితే ఇది ఎవరి పద్ధతి వాళ్ళది. ఎవరికి నచ్చినట్లుగా ఎవరు ఏం చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా మెహందీ వేడుకని చేస్తారు, గోరింటాకు ఎంత బాగా పండితే భర్తకి వారి మీద అంత ఎక్కువ ప్రేమ ఉంటుందని అంటుంటారు పెద్దలు.
అలాగే హల్దీ ఫంక్షన్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు ఇది కూడా ప్రజలు చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏ మంచి పని మొదలు పెట్టాలన్నా..పసుపును తప్పనిసరిగా భాగం చేస్తారు. ఎందుకంటే ఇది మంగళప్రదమైనది. దీన్ని ఉపయోగించడం వల్ల మంచి జరుగుతుందని భావించడమే దీనికి కారణం. అంతేకాక శరీరంలో చేరిన దుష్ట శక్తులను పారదోలే పవర్ పసుపుకి ఉందని మన నమ్మకం. అందుకే వధూవరులపై ఎలాంటి గాలి, ధూళి లేకుండా ఉండేందుకు వారికి పసుపు రాస్తారు. పసుపు ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు వంటి వాటిని తొలగించడంలో బాగా పనిచేస్తుంది. వివాహ కార్యక్రమంలో పాల్గొనే వధూ వరులు మరింత ప్రకాశవంతంగా కనిపించాలనే ఉద్దేశంతోనే పసుపును వారికి రాసి స్నానాలు చేయిస్తారు.
పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు వధూవరులకి ఆశీర్వాదాలు అందిస్తూ.. తనని అసలు వేడుకైన పెళ్లి కోసం సిద్ధం చేయడంతో పాటు.. కొత్తగా ప్రారంభించబోయే జీవితంలో కూడా అందం, ఆరోగ్యంతోపాటు, ఆనందంగా సాగాలని ఆశీర్వదించడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశం.