వింత నిబంధన.. బాత్రూంలో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే ఇక అంతే..!

ఏ ఉద్యోగి ఆయన బాత్రూంలో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపకూడదని వింత నిబంధన పెట్టింది ఓ కంపెనీ. ‘ఉద్యోగి ఎవరైనా బాత్రూంలో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపకూడదని షరతు విధించింది. ఒకవేళ పది నిమిషాల కంటే ఎక్కువ సేపు బాత్రూంలోనే ఉంటే వాసన చూసి దుర్వాసన రాకుంటే అతని పేరును పై అధికారికి పంపి అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’ అని వాష్ రూమ్ కు నోటీసులు అంటించారు. అయితే ఈ వింత నిబంధ‌న‌కు కార‌ణం లేక‌పోలేదు. చాలా మందికి తమ స్మార్ట్‌ఫోన్‌లను బాత్రూంలోకి తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. కొంతమంది అయితే ఫోన్‌ తీసుకెళ్లి గంటల తరపడి బాత్రూంలో ఉంటారు. దీని వల్ల చాలా సమయం వృధా అవుతుంది.

ఈ చెడు అలవాటును పోగొట్టేందుకు ఓ కంపెనీ తమ ఉద్యోగులకు వింత హెచ్చరిక జారీ చేసింది. ఏ ఉద్యోగి అయినా బాత్రూంలో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపొద్దని నిబంధన పెట్టింది. అయితే ఈ నిబంధన ఏ కంపెనీ పెట్టిందో తెలియలేదు. కానీ.. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. వాసన చూసే లక్కీ ఉద్యోగి ఎవరని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా, అలా అయితే బాత్రూంలో నీళ్లే పోయను అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. కొత్త ఉద్యోగం కావాలనుకేవారికి మంచి అవకాశం అని ఇంకో వ్యక్తి కామెంట్‌ చేశారు.