కొన్నిసార్లు వాదించడం కంటే.. మౌనంగా ఉండటమే బెటర్

-

కొందరు ప్రతి చిన్నదానికి వాదిస్తారు. ఆ వాదనలో అసలు మ్యాటరే ఉండదు. ఎలాంటి సంభాషణలో అయినా.. సభ్యత లేకుండా అసభ్యకర మాటలు విసురుతుంటారు. ఎదుటివారి మనోభావాలకు అసలు విలువనివ్వరు. అలాంటి సంస్కారం లేని మాటలకు మీరు స్పందించకపోవడమే బెటర్. ఎందుకంటే అదే వారి నిజస్వరూపం. వారి సంస్కారం అంతే అనుకుని మనం సైలెంట్ గా ఉండటమే మంచింది. అలాంటి వారితో వాదన అనవసరం. అది మీ ఆరోగ్యానికీ హానికరమే..

 

పోనీ..వారికి తెలిసేటట్లు, అర్థమయ్యేలా చెబుదామనుకున్నా వారు వినరు. అలా అని వారనే మాటలకు మీరు తక్కువైనట్లు ఎప్పుడు భావించకండి. ఎవరో ఏదో అన్నారని మీరెప్పుడూ తక్కువ కాదు. అలాంటి చెత్త మాటలు మీ గౌరవాన్ని తగ్గించవు. మీ చుట్టూ ఉన్నవారితో దయగా, మర్యాదగా ఉండండి చాలు. అదే మీ గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది. అంతేకానీ ఎవరో దారిన పోయే దానయ్య ఏదో అన్నాడని.. మీ గౌరవానికి భంగం వాటిల్లిందని ఫీల్ అవ్వడం వేస్ట్. మీ చుట్టూ ఉన్నవారికి మీరు ఏంటో తెలిస్తే.. తప్పు ఎవరిదో కూడా తెలిసిపోతుంది. తెలియని వారి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.

ఎవరైనా మీతో అసభ్యంగా, తక్కువ చేసి మాట్లాడినప్పుడు.. మీరు ప్రశాంతంగా ఉండండి. వారి మాటలకు మీరు కూడా దీటైన జవాబులు ఇవ్వొచ్చు. కానీ అది మీరు కాదు. ఎదుటివాళ్లు మిమ్మల్ని హర్ట్ చేసినంత సులువుగా.. మీరు వారిని హర్ట్ చేయలేరు. ఇది చాలా మెచ్చుకోదగిన విషయం. వారు అదుపు తప్పారని.. మీరు కూడా పరిధులను దాటి ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మీరు జవాబు ఇవ్వలేదంటే వాళ్ల కంటే తక్కువైపోయినట్లు కాదు. బురదలో రాళ్లు వేస్తే.. మన బట్టలే పాడవుతాయని గుర్తుంచుకోండి. సైలంట్ ​గా అక్కడి నుంచి వచ్చేయండి.

మీరు చేసే ప్రతి పనిలో బెస్ట్ ఇవ్వండి. అదే మిమ్మల్ని అందరికి దగ్గర చేస్తుంది. అలా అని అందరిని ఇంప్రెస్ చేయడానికి మీరు కష్టపడొద్దు. మిమ్మల్ని ఇష్టపడేవాళ్లు మీరు ఎలా ఉన్నా లైక్ చేస్తారు. మీపట్ల ఎవరైనా అసభ్యంగా బిహేవ్ చేస్తే.. మీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చే అవకాశముంది. అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ లోపల చాలా ఆన్సర్స్ ఉండొచ్చు. కానీ వాటిని బయటకు చెప్పి.. గొడవపడి మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోవడం తప్ప ఏం ఉపయోగం ఉండదు. అందుకే ఇలాంటి సమయాల్లో మౌనమే మంచి నేస్తం.

మనల్ని ఎవరైనా అనకూడదని మాటలు అన్నప్పుడు మనం చాలా బాధ పడుతుంటాం. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు మన నోటి నుంచి కూడా తప్పుడు మాటలు వచ్చే అవకాశముంది. అందుకే ఎవరైనా మనల్ని అనవసరపు మాటలతో బాధపెట్టినప్పుడు మనం కూడా నోరు జారకూడదు. అలా నోరు జారి తర్వాత ఎందుకు అన్నామా.. మౌనంగా ఉంటే సరిపోయేది అని రిగ్రెట్ ఫీల్ అవ్వొద్దు. క్షణకాలపు కోపం ఎన్నో ఏళ్ల బంధాలను దూరం చేస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకుంటే.. కోపం వచ్చినప్పుడు ఎదుటివారిని బాధపెట్టడకుండా ఉండటమే కాదు.. మనల్ని మనం బాధ పెట్టుకోకుండా ఉండేలా జాగ్రత్త పడొచ్చు.

మీరు కోపంలో ఎవరితోనైనా గొడవపడితే అది అక్కడితోనే ఆపేయండి. గొడవ జరిగిన తర్వాత కొద్దిసేపటికి శాంతపడండి. మళ్లీ మరుసటి రోజు ఇంతకు ముందులాగే స్నేహంగా మెలగండి. అంతే కానీ ఆ గొడవనే దృష్టిలో ఉంచుకుని మీ ఆత్మీయులకు దూరం కావొద్దు. మీకు నచ్చిన వ్యక్తులపై కోపం వచ్చినప్పుడు.. ఆ కోపం వచ్చిన క్షణాల గురించి కాకుండా.. అంతకుముందు వారితో మీకున్న బంధం గురించి ఆలోచించండి. వారు మీకోసం చేసిన పనులను గుర్తుచేసుకోండి. వారితో మీకున్న మంచి జ్ఞాపకాలను నెమరువేసుకోండి మీ కోపం క్షణాల్లో ఎగిరిపోతుంది.

ఎవ్వరిని బాధ పెట్టకుండా బతకడం కష్టం. కానీ సాధ్యమైనంత వరకు ఎవ్వరిని హర్ట్ చేయకుండా..మీరూ హర్ట్ అవ్వకుండా ట్రై చేయండి. అందరితో గౌరవంగా ప్రవర్తించండి. మర్యాద అనేది ఎప్పుడూ రెండు వైపుల నుంచి ఉండాలి. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోండి. పరిస్థితులు మీ చేయి జారకుండా చూసుకోండి. వీలైనంత వరకు పరిస్థితులు చేయి దాటుతున్న సమయంలో మౌనంగా ఉండండి. మీరు సైలెంట్ గా ఉంటే.. ఎదుటి వారి గురించి చాలా కొత్త విషయాలు తెలుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version