గూగుల్‌ పేలో సాంకేతిక లోపం.. స్క్రాచ్‌ కార్డుల ద్వారా రూ. 80 వేల వరకూ జమ..!

-

కొన్నిసార్లు..బ్యాంకులు వినియోగదరాలు ఖాతాల్లోకి లక్షల్లో డబ్బు జమ చేస్తుంటాయి. సాంకేతిక లోపం వల్ల ఇలా జరుగుతుంది.. అయితే మళ్లీ ఆ డబ్బును బ్యాంకులు తీసేసుకుంటాయి.. అయితే ఇలాంటి తప్పే గూగుల్‌పేలో జరిగింది..యూజర్ల ఖాతాలోకి రూ. 80 వేల వరకూ జమ అయ్యాయి.. ఇంతకుముందు ఫోన్‌పే, గూగుల్‌పేలో స్క్రాచ్‌కార్డులను స్క్రాచ్‌ చేస్తే.. పది ఇరవై వంద ఇలా డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఐదు రూపాయలు కూడా రావడం లేదు.. అన్నీ అనవసరమైన ఆఫర్స్‌..కానీ ఆ స్క్రాచ్‌ కార్డు లోపం వల్ల.. యూజర్లకు ఒక్కొక్కరికి 10 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకు జమ అయినట్టు తెలుస్తోంది.

గూగుల్ పే లో సాంకేతిక లోపం యాప్ యూజర్లకు వరంగా మారింది. పొరపాటున గూగుల్ పే యూజర్లకు భారీగా డబ్బులు జమ అయ్యాయి. తమకు భారీగా డబ్బులు వచ్చినట్టు అనేకమంది గూగుల్ పే యూజర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక్కొక్కరికి 10 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకు జమ అయినట్టు తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.800 నుంచి రూ.80 వేల వరకు యూజర్ల అకౌంట్లలోకి డబ్బులు వచ్చాయి. గూగుల్ పే యాప్‌లో సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగింది. గూగుల్ వెంటనే సమస్యను గుర్తించి పరిష్కరించింది. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగినట్టు గూగుల్ పే తెలిపింది.

ఇప్పుడు అసలు ఈ స్క్రాచ్‌ కార్డుల నుంచి డబ్బులే రావడం లేదు. దాంతో చాలామంది స్క్రాచ్‌ కార్డులను స్క్రాచ్‌ చేయడమే మానేశారు..కానీ ఈసారి అనేక మంది యూజర్లకు స్క్రాచ్ కార్డ్ స్క్రాచ్ చేస్తే 10 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకు డబ్బులు వచ్చాయి. దీంతో యూజర్లు షాక్ అయ్యారు. గూగుల్ పే సాంకేతిక లోపం గురించి జర్నలిస్ట్ మిషాల్ రెహ్మాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తనకు 46 డాలర్లు వచ్చినట్టు తెలిపారు.

ఇంకా అనేక మంది యూజర్లకు ఇలాగే డబ్బులు వచ్చాయి. అయితే సమస్యను గుర్తించిన గూగుల్ పే వీలైనంత వరకు డబ్బుల్ని వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో డబ్బులు వచ్చిన గూగుల్ పే యూజర్లు నిరాశ చెందారు. కొంతమంది రెడిట్ యూజర్లు కూడా గూగుల్ పే సాంకేతిక లోపం గురించి వివరించారు. ఒక యూజర్‌కి ఏకంగా 1072 డాలర్లు వచ్చాయట… అంటే సుమారు రూ.87,000 జమ అయ్యాయి. ఇంకొకరి అకౌంట్‌లో రూ.20,000 జమ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఇతర యూజర్లు వెంటనే తమ గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి స్క్రాచ్ కార్డ్స్ చెక్ చేశారు. అయితే అప్పటికే గూగుల్ పే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో వారికి నిరాశే మిగిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version