టీ తో ప్రధాని మోదీ చిత్రాన్ని అవలీలగా వేసిన కుర్రాడు.. ఫిదా అయిపోయిన నెటిజన్లు..!!

-

చేసే పని ఇష్టంగా చేస్తే.. అందులోనే అద్భుతాలు సృష్టించవచ్చు. అందుకే అంటారు.. ఏం చేసినా మనసుకు నచ్చిన పనే చేయాలి అని.. అప్పుడే క్రియేటివ్‌గా, స్మార్ట్‌గా ఆలోచించగలుగుతారు. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ.. కళాకారులు బొమ్మలు వేస్తే..ప్రాణం ఉందా అన్నట్లు కనిపిస్తాయి.. అంత అందంగా వేస్తారు. మధ్యప్రదేశ్‌కి చెందిన యువకుడు మాత్రం ఆహార పదార్ధాలు, ద్రవ పదార్ధాలతో పెయింట్స్ వేస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాడు.జబల్ఫూర్‌కి చెందిన ఓ యువ కళాకారుడు తాగే టీ తో అద్భుతమైన పెయింటింగ్‌ వేసి అందరిని మంత్రముగ్దులను చేశాడు.
దేశప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని వేశాడు..ఇప్పడు ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మధ్యప్రదేశ్‌ జబల్పూర్‌లోని రాంఝీ ప్రాంతానికి చెందిన సింటూ మౌర్య అనే యువకుడు తినే పదార్ధాలు, తాగే పానియాలు ఉపయోగించి.. కేవలం చేతి వేళ్లను బ్రష్‌గా మార్చుకొని అద్భుతమైన బొమ్మలు వేస్తున్నాడు. టమాటో సాస్, కచప్, ఉతికిన బట్టల నుంచి వచ్చే మురికి నీటిని ఉపయోగించి అదిరిపోయే చిత్రాలు వేస్తున్నాడు. తాజాగా తాగే టీతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోని వేశాడు సింటు మౌర్య. చిన్న టీ పొడిని డికాషన్‌గా స్టౌవ్ పై వేడి చేసి దాన్ని ఓ పేపర్‌పై పోసి తన చేతి వేలితో ప్రధాని బొమ్మ గీశాడు.
ఫింగర్ పెయింటింగ్ కళాకారులు గురించి మనకు తెలుసుకు.. ఇసుకతో చేతివేళ్లతోనే అద్భుతమైన బొమ్మలు వేస్తారు..కానీ సింటూ మౌర్య తరహాలో తినే పదార్ధాలు, తాగే పానియాలతో బొమ్మలు వేయడం మాత్రం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని స్థానికుల నుంచి నెటిజన్ల వరకూ అందరూ అంటున్నారు. రీసెంట్‌గా ప్రధాని మోదీ ఫోటోని టీతో వేయడం చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో లక్షల లైక్‌లు వచ్చాయి. సింటూ మౌర్య టాలెంట్‌ ఉపయోగించి టీ తో వేసిన ఫోటో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనలో టాలెంట్ ఉంటే.. అదే ఈ ప్రపంచానికి ఏదో ఒకరోజు మనల్ని పరిచయం చేస్తోంది.. ఏ మూల ఉన్న ఒకరోజు వస్తుంది.. అందరూ నీ టాలెంట్‌ గురించి మాట్లాడుకుంటారు..! ఏమంటారు..?

Read more RELATED
Recommended to you

Exit mobile version