ఆఫ్ఘ‌నిస్తాన్‌లో మొద‌లైన తిరుగుబాటు.. తాలిబ‌న్ల‌పై కొత్త యుద్ధం.. చేస్తున్న‌దెవ‌రంటే

-

ప్ర‌పంచాన్ని ఇప్పుడు ఓ వార్త ఉలిక్కి ప‌డేలా చేసింది. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉన్న ఆ దేశంలో అల్ల‌క‌ల్లోలం అయిపోతోంది. అదే ఆఫ్ఘనిస్తాన్‌. అమెరికా త‌న బ‌ల‌గాల‌ను వెన‌క్కు పిలిపించుకోవ‌డంతో అనూహ్యంగా తాలిబ‌న్లు త‌మ బ‌లాన్ని పెంచేసుకుని కేవ‌లం నెల‌ల వ్య‌వ‌ధిలోనే దేశం మొత్తాన్ని త‌మ గుప్పిట్లోకి తెచ్చేసుకున్నారు. ఇక ఇప్ప‌నుడు ఆ దేశ అధ్య‌క్షుడైన ఘనీ వారికి భ‌య‌ప‌డి దేశాన్ని విడిచి పారిపోయారు. ఇక ఆ దేశంలో ఉన్న మహా మహా ఘనులే వారికి భ‌య‌ప‌డి వేరే దారిచూసుకున్నారు.

ఇలాంటి తాలిబన్ భ‌యానికి తుపాకీ నీడలోకి వెళ్లి పోయిన దారుణ మైన ప‌రిస్థితుల్లో ఆఫ్గనిస్తాన్‌లో ఇప్పుడు ఓ కొత్త పోరాటం మొద‌లైంది. ఆ పోరాటం పేరే చారికర్ అని చెప్పాలి. ఆయ‌న ఎవ‌రో కాదు అతనే అమ్రుల్లా సలేహ్ అదేనండి అధికారాన్ని కోల్పోయినా ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్య‌క్షుడు అయిన అమరుల్లా సలేహ్ ఇప్పుడు ఆ దేశంలో ఓ సంచ‌ల‌నంగా మారిపోయారు. త‌న ద‌గ్గ‌రున్న సైన్యాన్ని న‌డిపిస్తూ తాలిబన్‌పై దాడులను ముమ్మరం చేసి వారికి భ‌యాన్ని రుచి చూపిస్తున్నారు.

ఇప్పుడు ఆ దేశ రాజ‌ధాని కాబూల్‌కు ఉత్తరాన ఉన్న పర్వాన్ పోవిన్స్‌లోని చారికర్ ప్రాంతాన్ని కూడా ఆయ‌న వ‌శం చేసుకున్నారు. ఎంతో ధైర్యంగా వ్యూహాత్మకంగా క్రికర్ నుండి ఓ సొరంగం ఏర్పాటు చేసుకుని మ‌రీ తాలిబ‌న్ల‌పై తిరుబాటు సైన్యంతో దాడులు చేయిస్తున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే ఉత్తర ఆఫ్ఘనిస్తాన్అలాగే మజార్-ఇ-షరీఫ్‌ను ఈ చారిక‌ర్ అనే ప్రాంత‌మే క‌లుపుతుంది. ఇక సాలెహ్ అనే నేత మాట్లాడుతూ అష్రఫ్ ఘని వేరే దేశానికి పారిపోలేదని ప్ర‌స్తుతం ఆయ‌న దేశంలోనే ఉంటున్నాడ‌ని, ఆయ‌న ఇప్పుడు త‌మ అధ్యక్షుడిని తెల‌ప‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version