ఈ గులాబీ ధర రూ.130 కోట్లు.. ప్రపంచంలోనే ఖరీదైన పువ్వు.!

-

ఈ నెల అంత ప్రేమికులకు పండగే.. సింగిల్‌గా ఉన్నవాళ్లు పైసల్‌ మిగుల్తాయ్‌ అసి సంతోష పడతారు. కమిట్‌ అయిన వాళ్లు మాత్రం ఈ వాలంటైన్స్‌ డే వీక్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తారు. రోజా పువ్వులకు ఈ నెలలో గిరాకీ బాగుంటుంది..అయితే ఇప్పుడు చెప్పుకునే రోజా పువ్వు ధర మాత్రం మీరు అస్సలు ఊహించలేరు. వందలు, వేలు కాదు, లక్షలు కాదు. ఏకంగా కోట్లలోనే ఉంటుంది. ఏంటి గులాబీలు అంత కాస్టా అనుకుంటున్నారా.. అవునండీ..!
ప్రపంచంలో భారీ ధర పలికే గులాబీలు ఉన్నాయి. రూ.130 కోట్ల వరకూ ధర పలుకుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 16 వివిధ రంగుల గులాబీ పూలను మనం చూడొచ్చు. ప్రతి పువ్వుకో ప్రత్యేకత ఉంటుంది. వీటిలో కొన్ని వాసన చూసేందుకు బాగుంటాయి. దాదాపు అన్ని అందంగానే కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం జూలియెట్ అనే గులాబీ ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా ఉంది. దీని ధర రూ. 130 కోట్లు పలుకుతుంది.
జూలియెట్ గులాబీ పువ్వు(Juliet Rose) వచ్చేందుకు 15 సంవత్సరాలు సమయం పడుతుందట. ఈ గులాబీని అనేక పువ్వులను కలిపి.. డేవిడ్ ఆస్టిన్ అనే వ్యక్తి.. సృష్టించాడు. 2006లో మెుదటిసారిగా జూలియెట్ గులాబీని ప్రపంచానికి పరిచయం చేశాడు. అప్పుడు 90 కోట్ల రూపాయలకు దీనిని విక్రయించారు. జూలియెట్‌న ధరకు మరొక కారణం కూడా ఉంది. ఈ పువ్వు నుంచి వచ్చే వాసన అమోఘం.. కొత్తరకమైన పెర్ఫ్యూమ్ సువాసనలా ఉంటుంది. చాలా మంది ఈ సువాసనను ఆకర్షితులవుతారు.. అంత బాగుంటదట..
రోమియో, జూలియెట్ ప్రేమకథ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అందుకే ఈ గులాబీకి జూలియెట్ అనే పేరు పెట్టారట… జూలియెట్ గులాబీ ధర ఏడాదికోసారి పెరుగుతూనే ఉంటుంది. ఈ పువ్వు చూసేందుకు కూడా చాలా అందంగా ఉంటుంది. సాధారణ గులాబీలా ఉండదు.. లోపల ముడుచుకుని చూసేందుకు కౌగిలించుకున్నట్లు కనిపిస్తుంది. పైసలుండాలే కానీ ఏదైనా కొనేయొచ్చు.. ఈ పువ్వులు మూడేళ్ల వరకు ఉంటాయట.. అందుకే అంత ఖరీదేమో..

Read more RELATED
Recommended to you

Exit mobile version