చాలామంది డబ్బుల్ని దాచుకోవాలని.. ఎక్కువగా సేవింగ్స్ చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఒక రూపాయి కూడా మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు సంపాదించే వాళ్ళు కచ్చితంగా కొన్నిటిని ఫాలో అవ్వాలి. లైఫ్ లో ఆర్థిక భద్రత కలగాలంటే సంపాదనతో పాటుగా ఖర్చుల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో అస్సలు తప్పులు చేయకూడదు ఖర్చుల విషయంలో తప్పులు చేసినట్లయితే మొత్తం డబ్బు అంతా పోతుంది. ఒక్క రూపాయి కూడా మీకు మిగలదు. డబ్బు విషయంలో చాలామంది ఈ పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈ చెడు అలవాట్ల వలన ఒక రూపాయి కూడా వాళ్లకు మిగలదు.
ఆడంబరాలకు పోతారు. ఆదాయానికి మించి ఖర్చులు చేస్తూ ఉంటారు. దీని వలన సంపాదించిన డబ్బు అంతా కూడా కరిగిపోతుంది. మిగిలేది సున్నా మాత్రమే. భవిష్యత్తు అవసరం గురించి డబ్బుని పెట్టుబడిగా పెట్టాలి. అలా చేయకపోతే సంపాదించిందంతా వృధాగా ఖర్చు అయిపోతుంది. అలాగే చాలామంది వారి దగ్గర డబ్బులు లేకపోయినా అనవసరమైన వాటిని అప్పు చేసి మరీ కొనడం.. లేదంటే క్రెడిట్ కార్డు ఉపయోగించడం వంటివి చేస్తారు. టైం కి అప్పు కట్టకపోతే వడ్డీ రూపంలో సంపద మొత్తం పోతుంది. రిటైర్మెంట్ కోసం మీరు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం చాలా ముఖ్యం.
లేదంటే చివరి రోజుల్లో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. డబ్బులు ఖర్చయిపోయి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరు ఇష్టానుసారంగా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఆ అలవాటు కూడా మానుకోవాలి లేదంటే అనవసరంగా చాలా డబ్బుని కోల్పోతారు. ఈ చెడు అలవాట్లలో ఏ ఒక్క అలవాటు ఉన్నా కూడా డబ్బు కరిగిపోతుందని గుర్తు పెట్టుకోండి. డబ్బుని ఆదా చేసుకోండి. సరిగ్గా ఖర్చు చేసుకోండి ఇక్కడ చెప్పినట్లు ఫాలో అయ్యారంటే డబ్బులు విషయంలో ఏ ఇబ్బందులు రావు.