చాలా మంది డబ్బు సంపాదించడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. నిజానికి డబ్బు ఎంతో కష్టపడితే కానీ రాదు. డబ్బు సంపాదన ఒక కళ అని చెప్పచ్చు. ఎవరైతే డబ్బు సంపాదించడం పట్ల ఆసక్తిగా ఉంటారో వారు తమ తెలివితేటలు ఎక్కువగా డబ్బు సంపాదనకు వాడుతూ ఉంటారు. సైకాలజీ ప్రకారం ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిలు బాగా డబ్బు సంపాదిస్తారట డబ్బు సంపాదించే అబ్బాయిలు సమయాన్ని ఎక్కువగా వృధా చేయరు. సమయాన్ని డబ్బు సంపాదనకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
అలాగే డబ్బు సంపాదించే వ్యక్తికి కావాల్సిన లక్షణం లక్ష్యం వైపు పయనించడం. లక్ష్యం వైపు వెళ్తేనే డబ్బు సంపాదించడానికి అవుతుంది. అలాగే డబ్బు సంపాదించే లక్షణాలు ఉన్న అబ్బాయిలు జీవితంలో భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుని లక్ష్యం వైపు వెళ్తారు. ఏ నిర్ణయం తీసుకున్న ఆర్థికంగా కలిసి వస్తుందా లేదా అనేది చూస్తారు. బాగా డబ్బు సంపాదించే అబ్బాయిల్లో ఆలోచనలకు తగ్గట్టు ప్రతిస్పందించడం, వినడం, వృత్తిపరమైన సంబంధాలను నిర్మించుకోవడం వంటివి కనబడతాయి.
డబ్బు సంపాదించాలంటే సరైన ప్రణాళిక అవసరం. అలాగే కొంచెం ఓపికతో ఉండాలి. అప్పుడే డబ్బులు వస్తాయి. డబ్బు సంపాదించాలంటే పని పట్ల అంకిత భావం ఉండాలి. ఇలా సైకాలజీ ప్రకారం ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిలు బాగా డబ్బులు సంపాదిస్తారు. ఎక్కువ ధనవంతులు అవ్వడానికి చూస్తూ ఉంటారు. త్వరగానే ధనవంతులు అయిపోతారు కూడా