ప్రస్తుతం పెరుగుతున్న జనాభాను బట్టి వారి అవసరాలను బట్టి పర్యావరణంలోని పచ్చదనాన్ని కోల్పోతున్నాం. కాలుష్యం పెరిగిపోతుంది కాలుష్యాన్ని తగ్గించడానికి ఎకో ఫ్రెండ్లీ ప్రోగ్రాం ని నిర్వహిస్తున్నారు అధికారులు. అంటే కాలుష్యాన్ని నివారించడానికి మొక్కల్ని పెంచడం, ఎన్ని మొక్కలు నాటితే గాలిని శుద్ధి చేసి కాలుష్యాన్ని తగ్గించగలం. ఈ సమస్య కు ఒక వినూత్నమైన ఆవిష్కరణ తెచ్చింది మెక్సికో కి చెందిన బయోమిటిక్ అనే స్టార్టప్ కంపెనీ. ఒక ఆర్టిఫిషియల్ ట్రీ ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
మెక్సికోకు చెందిన బయోమిటిక్ అనే స్టార్టర్ కంపెనీ తయారుచేసిన బయో అర్బన్ ఆర్టిఫిషియల్ ట్రీ. గాలిలో ఉండే కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక వినూతమైన ఆలోచనతో ఆవిష్కరించబడింది. ఈ ఆర్టిఫిషియల్ ట్రీ సహజమైన చెట్ల వలె గాలిని శుద్ధి చేయడంలో, సహాయపడుతుంది. ఇది పెరగడానికి స్థలము, టైం అవసరం లేదు. బయో అర్బన్ ట్రీ 14 మీటర్ల ఎత్తు సుమారు 3 మీటర్ల వెడల్పు ఉన్న ఒక లోహ నిర్మాణమైన చెట్టు. చూడడానికి ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. ఇది నిర్మించడంలో మైక్రో అల్జీ ఉపయోగపడుతుంది ఇది కార్బన్డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ కారకాలను శుద్ధి చేసి ఫ్రెష్ ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది.
ఆర్టిఫిషియల్ ట్రీ పనితీరు ధర : ఒక బయో అర్బన్ ట్రీ సుమారు 368 సహజ చెట్లతో సమానమైన కాలుష్యాన్ని నివారించగలదు. ఒక రోజులో 2890 మంది పీల్చే గాలిని శుద్ధి చేయగలదు. ఈ ట్రీ పెద్దగా చెట్లు నాటడం సాధ్యం కానీ ప్రదేశాలలో, పాఠశాలలు, ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు వంటి ప్రదేశాల్లో వీటిని ఉపయోగించవచ్చు.బయో అర్బన్ ఆర్టిఫిషియల్ ట్రీ యొక్క ధర సుమారు 50 వేల డాలర్స్.. మన కరెన్సీలో సుమారు 42 లక్షలు.
బయో అర్బన్ ఆర్టిఫిషియల్ ట్రీ అనేది సిటీ కాలుష్యాన్ని నివారించడంలో ఒక వినూతమైన ఆవిష్కరణ దీని ధర కొంచెం ఎక్కువే అయినా, కాలుష్యం తగ్గించడంలో ఇది గణనీయంగా ప్రభావం చూపుతుంది. ఈ ట్రీ పాఠశాలలు ఆసుపత్రులు రద్దీ ఉండే ప్రదేశాల్లో ప్యూర్ ఆక్సిజన్ అందించడానికి సహాయపడుతుంది. ఇలాంటి సాంకేతికతలను అమలు చేయడానికి స్థానిక ప్రభుత్వాలు సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటివి ఏర్పాటు చేయాలని ప్రజల కోరుతున్నారు. ఇక మనకు పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ లో వీటి పైనే మనం ఆధారపడతాం అనడంలో ఎటువంటి సందేహము లేదు.