భార్యా భర్త ఆనందంగా ఉండాలంటే ఈ ప్రామిస్ లని చెయ్యండి..!

-

భార్యాభర్త ఆనందంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. భార్యా భర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండాలంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసుకోకూడదు. వీలైనంత వరకు సర్దుకు పోతు వెళ్లాలి. చాలా మంది భార్యా భర్తలు చిన్న చిన్న కారణాల వలన విడిపోతూ ఉంటారు అది నిజంగా తప్పు. భార్య భర్తలు కలకాలం కలిసి ఆనందంగా ఉండాలంటే ఈ ప్రామిస్ లను చేసుకోవడం మంచిది అప్పుడు కచ్చితంగా ఆనందంగా ఉంటారు కలకాలం కలిసి సంతోషంగా జీవిస్తారు.

వాళ్లని బాధ పెట్టనని చెప్పండి:

ఏ సమస్య వచ్చినా ఏ గొడవ వచ్చినా హద్దు దాటి మాట్లాడి బాధ పెట్టాను అని ప్రామిస్ చేయండి. ఇది చెబితే కచ్చితంగా ఆనందంగా ఉండగలరు. అలానే ఆ మాటకి కట్టుబడి ఉంటే మంచిది.

గతాన్ని వదిలేస్తానని చెప్పండి:

చాలామంది గతంలో ఏమైనా తప్పులు చేస్తే వాటిని మర్చిపోకుండా పదే పదే వాటిని చెబుతూ పొడుస్తూ ఉంటారు. జరిగినవన్నీ వదిలేస్తానని చెప్పండి.

వారికి ఇష్టమైన వాళ్ళని గౌరవిస్తానని చెప్పండి:

నీతో పాటుగా నీకు నచ్చే వాళ్ళని కూడా నేను ఇష్టపడతానని వాళ్ళకి భరోసా ఇవ్వండి అప్పుడు వాళ్ళకి ఆనందంగా ఉంటుంది అలానే కుటుంబ సభ్యుల వలన కూడా ఇబ్బందులు రావు.

సమయాన్ని గడుపుతానని ప్రామిస్ చేయండి:

ఎన్ని పనులు ఉన్నా ఏం ఉన్నా నీతో పాటు ఆనందంగా సమయాన్ని గడుపుతానని ప్రామిస్ చేయండి. ఇలా భార్యాభర్తలు ఒకరికొకరు ప్రామిస్ ని చేసుకుంటే కచ్చితంగా జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు కలకలం కలిసి ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version