చదువు మీద దృష్టి నిలపడానికి చాలా రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఫెయిలవుతూ కనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు చదువుకుందామని పుస్తకం తీసే వారికి చదువు మీద దృష్టి నిలవమంటే నిలుస్తుందా? ఐతే కొంతమంది ఉంటారు. చదవాలన్న కోరిక ఉంటుంది. పకడ్బందీగా చదవాలని పుస్తకం ముందు పెట్టుకుంటారు. ఒక అరగంట చదవగానే, చాలా సేపు చదివామన్న ఫీలింగ్ వచ్చి, చాల్లే అని ఊరుకుంటారు. వీళ్ళు ఎక్కువ సేపు చదవలేరు.
చదువు మీద ఎక్కువ సేపు దృష్టి నిలిపేందుకు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
చాలామంది చేసే తప్పు ఏంటంటే, చదువుతున్నప్పుడు తమ మొబైల్ ఫోన్ ని పక్కనే పెట్టుకోవడం. అది అస్సలు కరెక్ట్ కాదు. మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేయడమో లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవడమో చేయాలి.
రెండు గంటలు చదువుదామని కూర్చుంటే, ఆ రెండు గంటలు చదువు మీదే దృష్టి పెట్టండి. మధ్యలో వేరే పని పెట్టుకోవద్దు. గంట గంటకీ విరామం ఇవ్వండి. ఒక పది నిమిషాల పాటైనా విరామం ఇస్తే బాగుంటుంది.
మూడు గంటల కంటే ఎక్కువ సేపు చదవద్దు. మూడు గంటలు కాగానే పుస్తకాలు పక్కన పెట్తేసి, వేరే పని చేయండి. అది పూర్తిగా చదువుకి సంబంధించినది అయ్యుండకూడదు. ఆటలు ఆడటం, వంట చేయడం బాగుంటుంది.
చదివే టైమ్ లో ఎక్కువ తినకూడదు. దానివల్ల బద్దకం వస్తుంది. అలాగే నీళ్ళు ఎక్కువగా తాగండి. దీనివల్ల శరీరానికి కావాల్సిన నీళ్ళు చేరి, ఫ్రెష్ గా ఉంటుంది.
మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఎదుటివాళ్ళతో పోల్చుకోకూడదు. వారు వారే, నువ్వు నువ్వే. పోల్చుకోవడం వల్ల అనవసర ఒత్తిడి ఎదురై చదువు మీద శ్రద్ధ చూపలేకుండా పోతారు.