ట్రంప్ కి బాలయ్యకు ఒక పోలిక ఉంది…!

-

అదేంటి అనుకున్నారా…? అవును ఉంది మరి. సోషల్ మీడియాలో ఏ చిన్న విషయాన్ని అయినా సరే పట్టి పట్టి చూసే సోషల్ మీడియా జనం తాజాగా ఒక విషయంలో ఇదే విధంగా చేసారు. భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా గాంధీ సబర్మతి ఆశ్రమానికి వెళ్ళారు. మోడీ తో కలిసి ఆశ్రమంలో కాసేపు గడిపారు. చరఖా తిప్పి కాసేపు గడిపారు.

ఇక ఈ సందర్భంగా ఆశ్రమంలో సందర్శకుల పుస్తకంలో ట్రంప్ తన అభిప్రాయాన్ని రాయడంతో పాటుగా ఒక సంతకం చేసారు. అలాగే ఆగ్రాలోని తాజ్ మహాల్ వద్దకు వెళ్ళిన ట్రంప్ అక్కడ కూడా సంతకం చేసారు. అయితే ఆయన చేసిన సంతకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సంతకాలు వైరల్ అవ్వడం ఏంటీ అంటారా…? ప్రతీ దానికి లింక్ పెట్టే సోషల్ మీడియా బాలయ్య సంతకానికి కూడా లింక్ పెట్టింది.

ట్రంప్ సంతకం ఉన్న ఫోటోతో బాలయ్య సంతకం ఉన్న ఫోటోను పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరు సంతకాలను ప్రపంచంలో ఎవరు కాపీ కొట్టలేరు అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం తాజ్ మహల్ నుంచి ట్రంప్ ఢిల్లీ మౌర్య హోటల్ కి వెళ్ళారు. అక్కడి నుంచి రాష్ట్రపతి రామనాద్ కోవింద్ ఇచ్చే విందుని ట్రంప్ స్వీకరించనున్నారు. రేపు పలు ప్రాంతాలను ట్రంప్ సందర్శించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version