కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారికి శ్రీవారి తలంబ్రాలు

-

టీటీడీ ప్రస్తుతం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకునే వధూవరులు, చేసుకున్న నవదంపతుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. శ్రీవారికి నిత్య కల్యాణంలో పవిత్ర తలంబ్రాలను వినియోగిస్తారు.

తిరుమల తిరుపతి దేవస్థానం.. దేశంలో ఎన్నో గుడులు ఉండవచ్చుగాక.. కానీ తిరుమల గుడి ప్రత్యేకతే వేరు. అక్కడికి వెళ్లి ఓసారి శ్రీవారిని దర్శించుకుంటే చాలు.. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసుకు ఏదో తెలియని ఉత్తేజం కలుగుతుంది. అందుకే.. తిరుమల తిరుపతి దేవస్థానానికి అంత ప్రత్యేకత. సాధారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అంత ఈజీ కాదు. కొన్ని గంటల పాటు లైన్ లో వేచి ఉండాలి. నిద్రకు ఓర్చుకోవాలి.. అప్పుడే శ్రీవారి దర్శనభాగ్యం కలుగుతుంది.

టీటీడీ ప్రస్తుతం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకునే దంపతులు, చేసుకున్న దంపతుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. శ్రీవారికి నిత్య కల్యాణంలో పవిత్ర తలంబ్రాలను వినియోగిస్తారు. ఆ తలంబ్రాలకు కొత్త దంపతులకు అందివ్వాలని నిర్ణయించింది. కొత్తగా పెళ్లయిన, పెళ్లి చేసుకోబోయే దంపతులు స్వామి ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా తిరుమలకు రావాల్సిన అవసరం లేకుండా… వాళ్లకు డైరెక్ట్ గా ఇంటికే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను అందివ్వాలని నిర్ణయించింది.

దానికోసం.. నూతన దంపతులు వాళ్ల పెళ్లి పత్రికను పోస్టు ద్వారా తిరుమలకు పంపించాల్సి ఉంటుంది. ఆ పెళ్లి పత్రిక ద్వారా.. నూతన దంపతులకు శ్రీవారి పవిత్ర తలంబ్రాలను పోస్టు ద్వారా ఉచితంగా పంపిస్తారు. కల్యాణ తలంబ్రాలతో పాటు కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని కూడా పంపిస్తారు.

ఇంకెందుకు ఆలస్యం.. మీకు ఇటీవలే పెళ్లి అయిందా? లేదా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? శ్రీవారి తలంబ్రాల కోసం వెంటనే టీటీడీ కాల్ సెంటర్ నెంబర్లు 0877-2233333, 2277777 ఫోన్ చేయండి.

అడ్రస్
ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మిన్ బిల్డింగ్స్, కేటీ రోడ్, తిరుపతి – 517501.

Read more RELATED
Recommended to you

Exit mobile version