నాన్ స్టిక్ పాన్ ల వాడకం ఈ మధ్య ఎక్కువైంది..వాటిలో ఆహారాన్ని వండటం వల్ల అంటుకోదు అలాగే పర్ఫెక్ట్ గా వస్తుంది.శుభ్రం చేసుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి.పైగా దోశల వంటివి నాన్ స్టిక్ పెనాలపై మంచి అందంగా వస్తుంటాయి. కనుక చాలా మంది వీటికి అలవాటు పడ్డారు. కానీ, వీటి వాడకం వల్ల ఉన్న హెల్త్ రిస్క్ లపై వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్లైండర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూకాస్టిల్ కు చెందిన పరిశోధకులు నాన్ స్టిక్ పాత్రల వాడకంపై ఓ పరిశోధన నిర్వహించగా, దీని ఫలితాలు సైన్స్ ఆఫ్ టోటల్ ఎన్విరాన్ మెంట్ లో ప్రచురితమయ్యాయి. నాన్ స్టిక్ అంటే అంటుకోనిది అని అర్థం. టెఫ్లాన్ అనే కెమికల్ కోటింగ్ వల్ల ఈ నాన్ స్టిక్ గుణం వస్తుంది. ఈ పాత్రలను వాడుకుంటూ, వాటిని శుభ్రం చేస్తున్న క్రమంలో కొంత కాలానికి ఈ కోటింగ్ కొద్ది కొద్దిగా పోతుండడం గమనించే ఉంటారు. ఇలా తొలగిపోయే టెఫ్లాన్ కోటింగ్ రూపంలో 9,100 కెమికల్ పార్టికల్స్ మన ఆహారంలోకిచేరుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
సూక్ష్మ ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ (ఒక మిల్లీ మీటర్ కంటే చిన్నవి) విడుదలను తెలుసుకునేందుకు పరిశోధకులు రామన్ ఇమేజింగ్ టెక్నిక్ ను పాటించారు. ఈ టెఫ్లాన్ మైక్రో ప్లాస్టిక్స్ ఆహారంలో కలుస్తుండడం ఆరోగ్యం విషయంలో ఆందోళన కలిగించే అంశంగా పరిశోధకులు చెబుతున్నారు.టెఫ్లాన్ కోటింగ్ తొలగిపోతున్న పాత్రల నుంచి 2.3 మిలియన్ మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ కణాలు విడుదల అవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కనుక వంటలకు వినియోగించే పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని ఫ్లైండర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పారు..ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మరీ పాన్ లను కొనడం మంచిది..ప్రాణం కన్నా కూడా ఏది ఎక్కువ కాదు కదా..