మాల్దీవ్స్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాల్దీవియన్ రాజధాని మేల్ నగరంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 9 మంది భారతీయులు ఉన్నట్లు వెల్లడించారు. ఒకరు బంగ్లాదేశ్ వాసి కాగా మరొకరిని గుర్తించలేకపోయామని చెప్పారు.
మేలేలోని రద్దీ ప్రాంతంలో గల ఓ భవనంలో మంటలు చెలరేగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో వెహికల్ రిపేర్ గ్యారేజీ ఉందని.. అందులో మంటలు చెలరేగి పై అంతస్తు వరకు వ్యాపించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బాధితుల్లో పొరుగు దేశాలకు చెందిన కార్మికులు ఉన్నట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Deadliest fire tragedy in the #Maldives. 11 dead bodies found so far. Reportedly all are migrant workers, packed in an overcrowded accommodation above a garage in the capital Male’ City. pic.twitter.com/Y9FhKSnDkz
— Save Maldives (@SaveMaldivess) November 10, 2022