వైరల్‌ వీడియో.. తెగిపడిన రక్తపింజరి తల..తనను తానే కాటేసుకుని విలవిలలాడిన పాము

-

పాము మనుషులు కాటు వేయడం గురించి విని ఉంటారు కానీ.. పాము తనను తానే కాటేసుకోవడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. అయితే ఇప్పుడు వినడం కాదు.. ఏకంగా చూసేయండి.. పాపం ఆ విషసర్పం తల తెగి పడింది.. అయినా దాని దేహం ప్రాణాలతోనే కొట్టుమిట్టాడుతుంది.. అలా తలకు తగిలింది.. పాము తనను తానే కాటేసుకుంది.. అసలు ఈ వీడియో చూస్తే ఎంత భయంగా ఉంటుందో..!! సోషల్‌ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పాముల వీడియో వైరల్‌ అవుతూనే ఉంటుంది. పాముల సయ్యాట, పాములు ఒక దానితో ఒకటి తలపడటం, లేదా పాముతో మనుషులు ఏదైనా తింగరిపని చేయడం… ఇలాంటి వీడియోలను మనం నెట్టింట చాలా సార్లు చూసి ఉంటాం.. కానీ.. ఒక పాము తనను తానే కాటేసుకోవడం, పైగా కాటేసుకుని ఆ నొప్పికి తట్టుకోలేక ఎంత విలవిలలాడిందో..మనం ఆ వీడియో ద్వారా చూడొచ్చు.. ఓడ్లీ టెర్రిఫైయింగ్‌ పేరుతో ఉన్న ట్విటర్‌ హ్యాండిల్లో పోస్టు చేసిన ఈ 15 సెకన్‌ల నిడివిగల వీడియోలో ఓ పాము (రక్తపింజరి) తల తెగిపోయి ఉంది. ప్రాణాలు పోకపోవడంతో ఆ పాము దేహభాగం ఇంకా కొట్టుకుంటోంది. ఈ క్రమంలోనే పాము దేహం వచ్చి తెగిపోయి పక్కన పడివున్న తలకు తగిలింది. అంతే ఆ తల నోరు తెరచి తన దేహాన్ని తనే గట్టిగా కాటేసి పట్టుకుంది. ఆ కాటువల్ల కలిగిన మంటకు పాము దేహం ఒక్కసారిగా మరింత వేగంతో కొట్టుకుంది. ఈ వీడియో చూస్తే ఒళు గగుర్లుపొడుస్తుంది..అయితే చాలా మంది అంటారు.. పాము తనను తాను కాటేసుకున్నా ఏం కాదు.. అది వేరే వారిని కాటేస్తేనే ప్రమాదం.. ఆ విషం పాము చిన్నప్పటి నుంచి మింగుతూనే ఉంటుంది కాబట్టి.. పాము ఒకవేళ పొరపాటున కాటేసుకున్నా ఎలాంటి ప్రమాదం ఉండదు అని.. కానీ ఇది ఎంత వరకూ నిజమో ఆ ఈశ్వరుడికే ఎరుక..!

 

Read more RELATED
Recommended to you

Exit mobile version