ఓహ్… పెళ్లి భోజనాలు ఇలా కూడా పెడతారా…?

-

పెళ్లి అనగానే ఏ స్థాయిలో హడావుడి ఉంటుంది చెప్పండి. ఎవరు అయినా సరే పెళ్ళికి వచ్చిన వాళ్లకు అప్పు చేసి అయినా సరే పప్పు కూడు పెట్టి పంపించాలి అని భావిస్తూ ఉంటారు. అలాంటిది కరోనా లాక్ డౌన్ లో మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. లాక్ డౌన్ లో ఇప్పుడు ఎవరూ కూడా పెళ్ళిలో భోజనం చేసే అవకాశాలు కనపడటం లేదు అనేది వాస్తవం. దీనితో కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు.

తాజాగా పెళ్ళికి వచ్చిన వారిని ఒక ఊరిలో పార్సిల్ విందు ఇచ్చి పంపారు. కృష్ణా జిల్లా కొండపల్లి పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్‌ కాలేషా తన కుమార్తెను విజయవాడ యువకుడికి ఇచ్చి ఈ ఏడాది మార్చిలో వివాహం చెయ్యాలని భావించారు. ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని డేట్ కూడా ఖరారు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో పెళ్లి వాయిదా పడింది.

లాక్ డౌన్ ని ఇప్పుడు జూన్ 30 వరకు పెంచారు. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా వివాహం చేద్దామని పెద్దలు నిర్ణయం తీసుకుని వరుడి తరుపున బంధువులకు చెప్పారు. వారు కూడా ఇందుకు అంగీకారం తెలిపారు. కేవలం 20 మంది ఆత్మీయులకే ఆహ్వానాలు పంపి౦చారు. ఆదివారం కొండపల్లిలో వివాహాన్ని నిరాడంబరంగా జరిపించిన పెద్దలు… భోజనాన్ని డబ్బాల్లో పార్సిళ్లు చేసి, బంధువులకు పంచిపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version