చాలామంది చనిపోయిన పూర్వికులనే పితృదేవతలని భావిస్తారు. కానీ ఇది నిజం. చాలా మందికి తెలియదు. పితృదేవతలు అంటే చనిపోయిన పూర్వీకులు కాదు. మరి పితృదేవతలు అంటే ఎవరంటే.. మనందరి రాకపోకలని పొందాల్సిన గతుల్ని పొందేలా చూసే దేవత వ్యవస్థ పితృదేవతలు. వాళ్ళనే పితృదేవతలని పిలుస్తారు. మనిషి చనిపోయిన తర్వాత మరో జన్మని ఎత్తడానికి 300 సంవత్సరాలు పడుతుంది.
పితృదేవతలు చనిపోయిన తర్వాత పెద్దలకి పెట్టే పిండాలు వాళ్లకి చేరేటట్టు చూస్తారు. మీ కుటుంబంలో వాళ్ళు చనిపోయి వెంటనే జన్మించినా కూడా పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. ఏ రూపంలో పెట్టిన సరే ఎలా పుట్టినా సరే వాళ్లకి చేరేలా ఈ పితృదేవతలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అందజేస్తారు.
ఒకవేళ కనుక మేక కింద ఆవు కింద ఎవరైనా పుడితే చేసిన పిండ ప్రధానం గడ్డి మొదలైన ఆహార పదార్థాల రూపంలో వెళుతుంది ఇలా పితృదేవతలు సంతోషిస్తారు. మంచి జరిగేలా చూస్తారు. ఒకవేళ కనుక మన పూర్వీకులు చనిపోయి దేవాలయంలో దేవతలుగా ఉంటుంటే పిండాలు అమృత రూపంలో వెళ్తాయి. మరణించిన వాళ్లు ముక్తని పొంది ఉత్తమ గతుల్ని పొందినట్లయితే చేసిన పిండ ప్రధానం ఎక్కడికి పోదు. కోరికలు తీరేందుకు అది ఉపయోగపడుతుంది.
కాబట్టి చనిపోయిన పూర్వీకులకి పిండ ప్రధానం చేయడం వంటివి చాలా అవసరం. ఇలా పిండ ప్రధానం వంటివి చేయడం వలన పితృదేవతలు సంతోషంగా ఉంటారు పితృదేవతలు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాము. రాబోయే తరాల వాళ్ళు కూడా సంతోషంగా వుంటారు. మన కోరికలు నెరవేరుతాయి. చనిపోయిన తర్వాత మనం పెట్టే పిండాలు పితృదేవతలు చనిపోయిన వాళ్లకి చేరేటట్టు చేస్తారు దాంతో వారు సంతోషంగా ఉండటమే కాదు మనం కూడా సంతోషంగా ఉండొచ్చు.