ఆల్కాహాల్‌ ఎందుకు గాజు గ్లాస్‌ల్లోనే తాగుతారు..? ఆనవాయితీ వెనుక ఉన్న కారణం ఇదే.!

-

మద్యం ప్రియులకు కొన్ని ఫన్నీ నియమాలు ఉంటాయి తెలుసా..? మందును గ్లాసులోకి పోసుకుని తాగేముందు కాస్త నేలపై పోస్తారు. ఏమన్నా అంటే మన తాతలకు అంటారు, ఇంకా చీర్స్ కొట్టుకుని షురూ చేస్తారు. తాగేది ఎంత చీప్‌ లిక్కర్‌ అయినా కాస్ట్‌లీ స్కాచ్‌ అయినా సరే.. గాజు గ్లాసుల్లనే తాగుతుంటారు. గాజు గ్లాసులనే వాడడానికి ఇష్టపడతారెందుకు.? ఎందుకు ఇంట్లో ఉన్న స్టీల్‌ లోటానో, గ్లాసునే తీసుకోవచ్చు కదా..! వాళ్లకు అది నచ్చదు. ఎందుకు ఈ ఆనవాయితీ.. దీని వెనుకు ఉన్న కారణం ఏంటో..?

గ్లాస్‌తో తయారు చేసిన వస్తువులు చక్కగా ఉంటాయి. అందులో వేసిన ఆహారాలను చూస్తే నోరూరేలా కనిపిస్తాయి. ఇది తటస్థ లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే అందులో వేసిన ఆహారాలతో ఎలాంటి రసాయనా సంబంధాలను కలిగి ఉండదనమాట. అలాగే రుచి, పదార్థాల వాసన చెక్కుచెదరకుండా ఉంటాయి. కానీ ఇతర రకాల గ్లాసులు వాటిలో వేసిన ఆహారంతో అవాంచిత రసాయనాల విడుదల అవుతాయి. రుచిని కూడా మార్చే అవకాశం ఉంది. అందుకే ఎక్కువగా గాజు గ్లాసుని ఆల్కహాల్ తాగడానికి వాడతారు. ఈ గ్లాసు పారదర్శకంగా ఉంటుంది. అందులో వేసిన ఆల్కహాల్ రంగు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మరింతగా తాగాలన్న కోరికను పెంచుతుంది. ఎందుకంటే ఆహారానికి విజువల్ అప్పీల్ చాలా ముఖ్యం. కాషాయం రంగులో ఉండే విస్కీ అయిన, క్రిస్టల్ క్లియర్‌గా కనిపించే వోడ్కా అయినా గాజు గ్లాసులో తమ రూపాన్ని, రంగును ఏమాత్రం మార్చుకోకుండా అలానే కనిపిస్తుంది. అందుకే ఎక్కువమంది గాజు గ్లాసులోనే ఆల్కహాల్, పానీయాలను తాగేందుకు ఇష్టపడతారు.

అలాగే గాజు గ్లాసులో వేసిన ఆల్కహాల్ ఉష్ణోగ్రత మార్పులను తట్టుకుంటుంది. గది ఉష్ణోగ్రతకు త్వరగా వచ్చేయదు. కాస్త చల్లగా కొంత కాలం పాటు ఉంటుంది. గాజు గ్లాసు గది ఉష్ణోగ్రతలో ఉన్న వేడిని ఆల్కహాల్‌కు బదిలీ చేయకుండా అడ్డుకుంటుంది. అందుకే ఆల్కహాల్ అమ్మకాలు కూడా గాజు సీసాల్లోనే ఉంటాయి. గ్లాస్ ఎక్కువ కాలం మన్నుతుంది. ఎక్కువ కాలం పాటు ఉపయోగించినా కూడా దాన్ని త్వరగా శుభ్రపరచాల్సిన అవసరం ఉండదు. అలాగే లోపల ఉన్న వ్యర్ధాలు కూడా క్లిస్టర్ క్లియర్‌గా చూపిస్తాయి. గాజు అనేది నాన్ పోరస్. అంటే బయటి వాసన, రుచి, బ్యాక్టీరియా వంటి వాటిని త్వరగా గ్రహించదు. పానీయాలు కాలుష్యం కాకుండా చూస్తుంది. అందులో త్వరగా చేరకుండా రక్షణ కల్పిస్తుంది. దీనివల్లే ఆల్కహాల్ ఎల్లప్పుడు గాజు వస్తువుల్లోనే భద్రపరుస్తారు. తాగేటప్పుడు కూడా గాజు గ్లాసులోనే తాగుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version