పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరో వైపు రాజకీయాలను చూసుకుంటూ మస్తు బిజీ గా ఉన్నాడు. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలలో వారాహి పేరుతో యాత్రను చేసి ప్రజల అభిమాని పొందాడు. అయితే తాజాగా ఈయన వ్యక్తిగత జీవితం గురించి మరొక్క వార్త వైరల్ గా మారింది. వారాహి యాత్రకు ముందుగా జరిగిన యాగానికి మరియు ఈ మధ్యన నాగబాబు కొడుకు హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్ధానికి కూడా న మూడవ భార్య అన్నా లెజెనోవా హాజరు కాలేదు. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని పవన్ కళ్యాణ్ మూడవ భార్యతో కూడా విడిపోయాడు అన్న వార్తలను వైరల్ చేశారు. పైగా ఈమె తన పిల్లలతో కలిసి ఫారిన్ లో ఉంటోందని… కానీ ఇంకా న్యాయపరంగా విడాకులు తీసుకోలేదని రాసింది. ఈ అంశంపై నిర్మాత మరియు నటుడు అయిన బండ్ల గణేష్ ఒక స్థాయిలో ఫైర్ అయ్యాడు.