లారీల వెనుక ఉండే హార్న్‌ ఓకే ప్లీజ్‌ అనే పదాలకు అర్థమేంటి..? రెండో ప్రపంచ యుద్ధం నుంచే ఉందా..?

-

లారీలపై ఏవేవో అక్షరాలు రాసి ఉంటాయి… అవే ఓనర్లు ఏదో డెకరేషన్‌కు రాశారనుకుంటారు చాలామంది… కానీ కొన్ని పదాలకు చాలా ఇన్నర్‌ మీనింగ్‌ ఉంటుంది. మీరు గమనించి ఉన్నట్లైతే.. చాలా లారీలకు వెనుక Horn Ok Please అని రాసి ఉంటుంది. దాని అర్థం మీరు ఏమనుకుంటున్నారు..? హారన్‌ కొట్టినా ఓకే.. ప్లీస్‌ కొట్టండి పర్వాలేదు అని అనుకుంటున్నారా.. హారన్‌ కొట్టుచు ఓకే అనా.. Horn Ok Please అంటే ఏంటంటే..!!

ఈ హార్న్‌ ఓకే ప్లీజ్‌ అనే పదాలు చూసిన వాహనదారులు అనవసరమైన హారన్‌ ఉపయోగించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారనిక సెక్షన్‌ 134 (1) వాహన చట్టం కింద 2015 ఏప్రిల్‌ 30న మహారాష్ట్ర సర్కార్‌ వాహనాలపై Horn Ok Please అనే పదాలను బ్యాన్‌ చేసింది.

అయితే ట్రక్‌ రోడ్డుపై వెళ్తున్నప్పుడు దానిని ఎవరైనా ఓవర్‌ టెక్‌ చేయాలి అనుకుంటే ముందుగా హారన్‌ కొడతారు. దీంతో ముందు వాహనం నడిపే ట్రక్‌ డ్రైవర్‌ తన వెనుక మరో భారీ వాహనం వస్తోందని గమనించి వాళ్లు ఓవర్‌టెక్‌ చేయ్యాలనే ఉద్దేశంతో హారన్‌ కొట్టారని అర్థం చేసుకుంటారు. వెనుక వాహనానికి ముందున్న వాహన డ్రైవర్‌ దారి ఇస్తాడు.

OK అంటే అర్థం ఏమిటి?

కొన్ని ప్రాంతాల్లో సింగిల్‌ రోడ్డు ఉండటం వల్ల చిన్న వాహనాలు మాత్రమే నడుస్తుంటాయి. కానీ కొన్ని సమయాల్లో ముందున్న పెద్ద వాహనం లాంటి లారీ ఉంటే ఓవర్‌ టెక్‌ చేయడానికి వీలుండదు. రోడ్డులో ఎదురుగా ఏ వాహనం వస్తుందో తెలిసేది కాదు. పెద్ద వాహనాన్ని దాటేందుకు వెనుకున్న వాహనదారులు హారన్‌ కొట్టగానే ముందున్న వాహనంలోని డ్రైవర్‌ OK అని అర్థం వచ్చేలా ఓ వైట్‌ కలర్‌ బల్బును వెలిగించేవారు. ఆ బల్బు వెలిగితే ఓవర్‌ టెక్‌ చేసుకోవచ్చని అర్థం.

ఇంకో అర్థం కూడా ఉంది..

రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ట్రక్‌ డ్రైవర్లు వాహనాలకు డీజిల్‌కు బదులుగా కిరోసిన్‌ వాడేవారు. డీజిల్‌ ఖర్చు తగ్గుతుందని ఇలా కిరోసిన్‌ను వాడేవారు. అయితే డీజిల్‌ కంటే కరోసిన్‌కు మండే స్వభావం ఉంటుంది. అందుకే వాహనం నడుపుతున్నట్లయితే ఆ వాహనం వెనుక OK రాసి ఉండేది. ఇక్కడ ఓకే అంటే ఆన్‌ కిరోసిన్‌ (On Kerosene) అని అర్థం. ఈ పదం కనిపించగానే వెనుకన్న వాహనాలు మరీ దగ్గరకు రాకుండా జాగ్రత్త పడేవారు.

కిరోసాన్‌ వాహనం కదా అని మరీ దగ్గరకు రాకుండా కొంత డిస్టాన్స్‌ పాటించేవారు. దీని వల్ల కరోసిన్‌ వల్ల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా వెనుకున్న వాహనంకు ప్రమాదం కలుగకుండా ఉండేందుకు ఈ OK పదాన్ని రాసేవారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version