ముక్కులో ఇరుక్కుపోయిన కర్రముక్క.. వారం రోజుల వరకు కనిపెట్టలేకపోయిన మహిళ..

-

తైవాన్ కి చెందిన 29ఏళ్ళ మహిళ, తన ముక్కులో ఏదో ఇబ్బందిగా ఉందని వైద్యుడిని సంప్రదించించి. షాకింగ్ గా ఆమె ముక్కులోంచి రెండు కర్రముక్కలు బయటపడ్డాయి. ఈ విషయం తెలిసిన మహిళ దిగ్భ్రాంతికి గురైంది. ముక్కులో కర్రముక్కలు ఇరుక్కుపోవడం ఒక ఎత్తైతే, వాటిని వారం వరకు గుర్తించకపోవడం మరో గమ్మత్తు. అసలు ముక్కులో కర్రముక్క ఇరుక్కుపోవడానికి కారణాలను కనుకున్న మహిళ, దానికి ఆమె చెల్లెలితో గొడవపడడమే అని చెబుతుంది.

వారం క్రితం అక్కాచెల్లెల్లిద్దరూ గొడవ పెట్టుకున్నప్పుడు పక్కనే ఉన్న ఏదో ఒక పాత్రతో కొట్టుకున్నారు. ఆ పాత్రకి ఉన్న కర్రముక్కలు ఆమె ముక్కులోకి కర్రముక్క దూసుకుపోయింది. అప్పుడు, తన ముక్కులోంచి రక్తం రావడం, ఎడమ కన్ను ఉబ్బడం వల్ల ఆస్స్పత్రిలో జాయిన్ అయ్యింది. ఎక్స్ రే తీసుకున్న డాక్టర్లు ఫరవాలేదని ఇంటికి పంపించారు. ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ తన ముక్కులో ఏదో అపశృతి కలుగుతుందని ఆమె గుర్తించింది. ఆ తర్వాత దెబ్బలాడుకున్న వస్తువుల్లో కర్రముక్కలు లేవని గమనించింది.

వెంటనే అద్దంలో జాగ్రత్తగా గమనిస్తే రెండు కర్రముక్కలు కనిపించాయి. అపుడు, హాస్పిటల్ కి వెళ్ళింది. అక్కడ సీటీ స్కాన్ నిర్వహించిన వైద్యులు, ఆమె ముక్కులో కర్రముక్కలు ఉన్నాయని గుర్తించి, సర్జరీ చేసి ఆ ముక్కలను తీసేసారు. రెండు కర్రముక్కలు ముక్కులో ఉన్నప్పటికీ చర్మం మీద రెండు చిన్న గీతలు తప్ప ఏమీ కాకపోవడం గమనార్హం. ఈ విషయమై వైద్యులు కొన్ని జాగ్రత్తలు సూచించారు. ఎప్పుడైనా ఏదైనా వస్తువులు పుర్రె భాగంలోకి చేరితే దానివల్ల పెద్ద ఇబ్బంది కలగదు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version