అక్కడ అరకిలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే.. భోజనం ఉచితం..!

-

ప్లాస్టిక్ వల్ల ప్రస్తుతం పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుందో అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల అనేక దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. అందుకే పెరిగిపోతున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ఇప్పుడు అనేక స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ, సామాజిక వేత్తలు నడుం బిగిస్తున్నారు. ఇక ఒడిశాలోని ఓ కేఫ్ కూడా పర్యావరణ పరిరక్షణకు తన వంతు సహాయం అందిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు అక్కడి భువనేశ్వర్ సిటీలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేమిటంటే…

ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఓ కేఫ్ నిర్వాహకులు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహార్ స్కీంలో భాగంగా మీల్ ఫర్ ప్లాస్టిక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ) భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా భువనేశ్వర్‌లో మొత్తం 11 చోట్ల ఆహార్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే ఆ నగరంలో అరకిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఆ సెంటర్లకు తీసుకెళ్లి ఇస్తే ఆ కేంద్రాల్లో ఉచితంగా భోజనం పొందవచ్చు. దీంతో ఓ వైపు ప్లాస్టిక్‌ను నివారించడంతోపాటు మరోవైపు నిత్యం ఆహారం కూడా పొందలేని పేదలకు కూడా సహాయం అందించిన వారమవుతామని ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

కాగా త్వరలోనే భువనేశ్వర్‌లో మరిన్ని చోట్ల ఆహార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ కార్యక్రమం సత్ఫలితాలనే ఇస్తుందని అంటున్నారు. అయితే ఇదే కార్యక్రమాన్ని ఇతర రాష్ర్టాలు కూడా ప్రేరణగా తీసుకోవాలని పలువురు పర్యావరణ వేత్తలు కోరుతున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version