అఖిల్ కోసం వదిన సమంత అంత గొప్ప సాయం చేస్తోందా……??

-

టాలీవుడ్ యువ నటుడు అక్కినేని అఖిల్, చిన్నప్పుడే తండ్రి నాగార్జున హీరోగా తెరకెక్కిన సిసింద్రీ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఇక అక్కడి నుండి తన చదువులపై దృష్టిపెట్టిన అఖిల్, పెరిగి పెద్దయ్యాక, పూర్తి స్థాయి నటన మరియు డాన్స్ వంటి వాటిల్లో మంచి శిక్షణ తీసుకుని వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ అనే సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యాడు. అయితే తొలి సినిమానే అఖిల్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ఆ తరువాత విక్రమ్ కుమార్ తో హలో, ఆపై వెంకీ అట్లూరితో మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించిన అఖిల్ కు ఇప్పటివరకు కెరీర్ పరంగా మంచి సక్సెస్ అయితే లభించలేదు. ఇక ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకుని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న అఖిల్, ఆ సినిమా తో తప్పకుండా మంచి సక్సెస్ ని అందుకుని కెరీర్ లో మంచి బ్రేక్ అందుకోవాలని చూస్తున్నాడు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అఖిల్ వదిన సమంత కూడా ఇందులో ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనున్నట్టు టాక్.

 

ఈ సినిమాలో హీరో ఒక లేడీతో తన జీవిత కథను చెప్తూ ఉంటాడని, అయితే అతడు కథను వినే మహిళగా సమంత నటిస్తోందని అంటున్నారు. స్వతహాగా టాలీవుడ్ గోల్డెన్ లెగ్ భామగా కెరీర్లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించిన సమంత, ఈ సినిమా ద్వారా మరిది అఖిల్ కు మంచి సక్సెస్ ని అందించి తీరుతుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని, వేసవి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం……!!

Read more RELATED
Recommended to you

Exit mobile version