క్రిస్మస్‌ రోజు ఈ దేశాల్లో పాటించే సంప్రదాయాలు తెలిస్తే షాక్‌ అవుతారు..!

-

క్రిస్మస్‌ అంటే ఏసుక్రీస్తు పుట్టినరోజు. అందుకే ఆరోజు అందరూ కేక్‌ కట్‌ చేసుకుని కొత్తబట్టలు వేసుకుని ఫ్యామిలితో జాలీగా గడుపుతారు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం వింత ఆచారాలు పాటిస్తారు. కొన్ని ఆచారాలు వినోదంగా అనిపిస్తే మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. క్రిస్మస్‌ రోజు పాటించే ఆ విచిత్రమైన ఆచారాలు గురించి తెలుసుకుందామా..!

షూస్ వదిలేస్తారు

ఐస్ ల్యాండ్లో యూల్ లాడ్స్ కోసం చిన్న పిల్లలు షూస్ వదిలిపెడతాడు. ఒక రకంగా చెప్పాలంటే యూల్ లాడ్స్ కూడా శాంతా క్లాజ్ మాదిరిగా సహాయం చేసేవాళ్ళు. 13 మంది యూల్ కుర్రాళ్ళు పిల్లలకి బహుమతులు ఇస్తూ వస్తారు. క్రిస్మస్‌కి 13 రోజుల ముందు నుంచి పిల్లలు ప్రతి రోజు రాత్రి ఇంటి బయట షూస్ వదిలేస్తారు. యూల్ లాడ్స్ వచ్చి వారికి ఆ షూస్‌లో బహుమతులు పెడతారని నమ్ముతారు. మంచి ప్రవర్తన ఉన్న పిల్లలకి మంచి బహుమతులు వస్తాయి. చెడుగా ఉంటే వారికి షూస్ లో కుళ్లిన బంగాళాదుంపలు ఉంటాయట.

క్రాంపస్ రన్

ఆస్ట్రియాలో శాంతా క్లాజ్ సెయింట్ నికోలస్ గురించి అందరికీ తెలుసు. కానీ ఇక్కడ దుష్టుడు క్రాంపస్ ఉన్నాడు. శాంతా క్లాజ్ పిల్లలకి బహుమతులు ఇవ్వడానికి వస్తే క్రాంపస్ మాత్రం పిల్లలని ఎత్తుకుపోవడానికి వస్తాడు. ఏటా క్రిస్మస్ రోజు క్రాంపస్ రన్ నిర్వహిస్తారు. ముఖానికి భయంకరమైన క్రాంపస్ మాస్క్ పెట్టుకుని వీధుల్లో సంచరిస్తారు. అందుకే ఆ రోజు పిల్లలు వీధుల్లో తిరగరు.

చీపురు దాచిపెడతారు

నార్వేలో ప్రజలు ఆరోజు చీపురుని దాచి పెడతాడు. ఇది శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయ ఆచారం. మంత్రగత్తె చీపురుపై తిరుగుతూ ఉంటుందట. ఎవరి ఇంట్లో చీపురు కనిపిస్తే వారి ఇంట్లో మంత్రగత్తె తిష్ట వేసుకుని కూర్చుంటుందని భావిస్తారు. అందుకే ఆ రోజు అందరూ చీపురు ఎవరికీ కనిపించకుండా దాచి పెడతాడు. అలా చేయడం వల్ల దుష్టశక్తులని నివారించవచ్చని నమ్ముతారు.

స్నో బాల్ ఫైట్

ఇదొక ఫన్నీ సంప్రదాయం. క్రిస్మస్ రోజు అందరూ మంచులో చేరి స్నో తో బాల్స్, బొమ్మలు తయారు చేసి ఒకరి మీద మరొకరు విసురుకుంటారు. ఈ స్నో బాల్ ఫైట్ లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు.

లాంతర్ ఫెస్టివల్

ఫిలిప్పీన్స్‌లో ప్రతి సంవత్సరం క్రిస్మస్ ముందు రోజు లాంతర్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ప్రజలు అందరూ రోడ్ల మీదకి చేరి లాంతర్లు గాల్లోకి వదులుతారు. వివిధ రకాల ఆకారాల్లో ఉండే లాంతర్లు చూసేందుకు అందరూ వస్తారు. ఈ సంప్రదాయం ఒక ఈవెంట్‌గా చేస్తున్నారు.

మేక పుర్రె కాల్చేస్తారు

1960 నుంచి స్వీడన్ లోని ప్రజలు ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. పట్టణం మధ్యలో 40 అడుగులకి పైగా పొడవు ఉండే పెద్ద మేక పుర్రె లేదా మేక బొమ్మ తయారు చేస్తారు. ఈ క్రిస్మస్ మేక బొమ్మని చూసేందుకు నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. అర్థరాత్రి తర్వాత దాన్ని కాల్చేస్తారు. దీనికి కారణం ఏంటో తెలియలేదు.

సాలెపురుగు డెకరేషన్

ఉక్రెయిన్‌లో క్రిస్మస్ చెట్టుని సాలెపురుగు గూడుతో అలంకరిస్తారు. దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. ఒక పేద కుటుంబంలోని చిన్నారి క్రిస్మస్ చెట్టుని అలంకరించలేకపోయినందుకు చాలా బాధపడతాడు. తెల్లారి లేచి చూసేసరికి చెట్టు మొత్తం సాలెపురుగులు గూడు పెట్టి ఉంటాయి. దాన్ని చర్చికి తీసుకెళ్లగా అందరూ ఆ చిన్నారిని చూసి హేళనగా నవ్వారు. అప్పుడే అద్భుతం జరిగింది. ఆ సాలె గూడు తీగలు బంగారం, వెండి తీగలుగా మారిపోయాయట. ఇప్పటికీ అక్కడ చాలా మంది సాలెపురుగు గూడుతో క్రిస్మస్ చెట్టు అలంకరిస్తారు. అలా చేస్తే అదృష్టం వస్తుందని నమ్ముతారు.

చెక్ రిపబ్లిక్

క్రిస్మస్ రోజు పెళ్లి కానీ స్త్రీలు ఇంటి గుమ్మం ముందు నిలబడి భుజాల మీద ఒక బూటు పెట్టుకుని కిందకు వంగుతారు. ఆ బూటు వారి కాళ్ళ మీద పడితే పెళ్లి అవుతుందని నమ్మకం. గుమ్మం ముందు పడిపోతే పెళ్ళికి మరో ఏడాది పాటు ఆగాల్సిందేనట.

Read more RELATED
Recommended to you

Exit mobile version