నెత్తిన మంటలు మోయగలగడం సులువు
మంటల్లో దేహాలను హాయిగా నిద్దురపుచ్చడం సులువు
ఈ సారి దేహాలకూ మనస్సులకూ కూడా ఈ మంటే ఊరడింపు
కనుక ప్రతిసారీ ఆ..జ్వాల-ఆ..కీల అన్నీ..అన్నీ..అనంతానంత జగతి
ప్రస్థానానికి ఓ ఆటంకం..అదే అడవి సూత్రానికి ఆటంకం..కనుక కానలను
కాల్చిన జ్వాల, కాయాన్ని కాల్చడం కూడా ఇష్టంగానే చేసుకుంటుంది కదా!
శరీరంపై హక్కు ప్రకృతికి ఇచ్చి బాధ్యతను విస్మరించడం నీవు చేసుకున్న
పాపం ఇక అనుభవించు..అవును ఇవి..
కొనసాగింపు కాలాల దగ్గర కొనసాగింపు మాటలు
కాలానికీ – దుఃఖానికీ అభేదం ఒకటి ఇవ్వాలి
కానీ దుఃఖం చిరాయువుగా మారాక కాలం మారక విలువను
మార్చుకుంటుందని ఎలా అనుకోగలం?కనుక జీవితం విస్తృతం దగ్గర చిన్న
బోతోంది.విస్తృతం కానీయని సందర్భాన ఒక పెద్ద బడబాగ్ని నెత్తిన పడుతోం
ది..ఈ సూర్య గోళాల ప్రావస్థలు అన్నీ ఇలానే అనవసరపు కోపాన్ని చిమ్ము
తున్నాయి.అయినా!మనిషేం మారాడు?
దేహగదుల వేర్పాటును ప్రేమించడం అలవర్చుకోవాలి.ఉన్నరోజున అవి ఎన్నిం టినో నింపుకుని తమ ఖాళీతనాన్ని నింపుకుని హాయిగా ఉంటు న్నాయి. మరి లేని రోజో! అదే ముందున్న రోజు. లేనిరోజు అంటే నీళ్లు లేని రోజు లేని రోజు అంటే అన్నం లేని రోజు..లేని రోజు అంటే సంతోషం లేని రోజు..ఇవి ఆ గదుల కు ఎందుకని?అవును గదులను నింపాల్సింది మనమే.ఖాళీతనం ఉన్న రోజు న ఉన్నత స్థితి ఉన్న రోజును తల్చుకుని ఏ డ్వాల్సిందీ మనమే..అవును గది ని ఖాళీ చేయడం కాదు గదే మనల్ని మోసం చేసి పోతోంది.ఆకాశంలో కూడా కొన్ని మాయా స్వరాలు ఇలానే మోసం చేస్తున్నాయి.ముందున్న కాలమే చె డ్డది అని చెబితే నవ్వారొకరు.అవును చావును మీరు ఆహ్వానిస్తే ప్రతిఫలం హాయిగా ఉంటుంది అంటే వినరే!సరిపడినంత సంతోషం జీవితాన దొరక్క సతమ తం కావడం కన్నా ఇలాంటి ఒక చావు రేవు చివర అలభ్యం కాకుండా ఉంటేనే మేలు..కనుక మరణ లభ్యతను ప్రేమించాలి..చావు సౌకర్యంగా ఉంటుందని అ నుకోగలమా! తప్పు!అన్నీ..అన్నీ..అసౌకర్యాలకూ..చింతనలకూ..పరాకాష్టగా మారాకనే అంతిమావస్థ ఒకటి పలకరించి పోతుంది.ముందున్న కాలం ఒకడు ఊహిస్తే..గతం అతడ్ని వెక్కిరించిందని విన్నాను.చదివేను కూడా! ముందు న్న కాలం ఇలానే ఉంటుందని అనుకోలేం కానీ ఈ దరిద్రాన్ని మాత్రం తప్పక కొనసాగిస్తుంది.కనుక మరణ శయ్యను సిద్ధం చేసుకోవడం ఓ సులువయిన పని.
రేపటి అంచనాలను చెరిపిపోవాలని ఉంది.అసలీ గీతలనూ వక్రగతులనూ న మ్మి మోసపోయేం కదా!కనుక అరచేతి గీతల ప్రయాణం నమ్మ బుద్ధి కావడం లేదు.జీవితాన నిర్భీతి అన్నది ఒకటి ఉండకూడదని నిర్థారణకు వచ్చేను.అ వును ఒక భయం సానుకూల సంజ్ఞల జారీలో కానగ వచ్చునేమో! మనిషిని మట్టిని వేరు చేసి హాయిగా నవ్వుతున్న టెక్నాలజీ ఈ ఒయాసిస్సుల సృష్టిని ఎందుకు చేయలేకపోతోందని?కనుక మట్టిలో కలిసిపోవడం సులువు..మట్టిని కూడా మిగల్చనీయని దరిద్రగొట్టు జీవులను తరిమికొట్టడమే కష్టం.జీవ గొం తుకలు కొన్నిసార్లు మట్టి పెళ్లల్లా ఎక్కడెక్కడో నాటుకుపోతాయి.లేదా అవి నే ల దిగువ భాగానికి చేరిపోతాయి.కనుక సమూహం తరఫు గొంతుకలను న మ్ముకోవడం కన్నా ఎవరికి వారు గుండె నిబ్బరం పెంచుకోవడం మిన్న.ఈ సా రి కూడా గొంతుకలను సవరించే ప్రయత్నం ఒకటి ఎవరో చేస్తున్నారు.అయినా ఫలితం ఎలా ఉంటుందో మరి! దేశ మంతా గుక్కెడు నీరు అవశ్యం కావాలని ప ట్టుబడుతోంటే..ప్రయోగశాలల్లో నీటి తయారీ మార్కెట్ శక్తులకు అనుగుణంగా మారిపోతోంటే, మన చర్యల్లో శుద్ధత ఎంతన్నది ఇప్పుడిక ప్రశ్నార్థకం.కనుక రెండంటే రెండు ప్రశ్నలు ఉన్న రోజు ప్రశ్న..ఉండాల్సిన రోజున కూడా ప్రశ్నే..శా సిస్తోంది.
కుండలు నింపుకుని కడివెడు ఆనందం మోసుకుని నదిని ఇంటికి చేర్చిన రో జులు లేవు.కుండపోతగా వానలు మన చావిళ్లలలో పలకరించిన సందర్భ మూ లేదు.అసలు దీర్ఘంగా తోచిన ఆలోచనకు పరిష్కృతి లేదు.తెగిన దారపు పోగుల్లా ఈ మనుషులు రంగులు పులుముకుని ఎదురొ స్తున్నారు.ఏ బాధా లేదు..బెంగా లేదు.వానొచ్చినా..రాకున్నా..ఉన్న చలిమర గదులన్నీ హాయిగా సుఖాన్నీ-భోగాన్నీ..ఇస్తున్నాయి కదా చాలు..ఏం కాదు..అస్సలస్సలు మ గ్గం కదలడం లేదు.కండెలు కదలడం లేదు..దారం కదలడం లేదు.అసలీ ప్ర పంచం కదలక చాలా కాలం అయింది.బద్ధకంగా కదిలిన ఒక మేఘం కూడా మూఢం ఉన్నదేమో అని చూస్తోంది.మనుషులు కూడా అలానే ఉన్నారు.మురికి కూ పాలు ఇంటెదుర ఎలానో నెత్తిపై కూడా అలానే ఉన్నాయి.ఖండిత ప్రావ స్థలలో లో చూపు అంతగా లెక్క తేలనీయడం లేదు.లోపలి లోకాలకు జబ్బు చేసింద ని నిర్థారించాలి.ప్రపంచంలో లోపలి లోకాలు ఎన్ని ఉన్నాయి అవన్నీ ఆ దీర్ఘ కాల నిద్రలో ఉన్నాయని తేల్చిపారేయ్యాలి. ఇప్పుడక్కడా ఇక్కడా కూడా ని ర్ణిద్రను ధరించిన జీవం లేదు..చైతన్య ఝరి అని పిలుచుకుందాం అంటే అదీ లే దు.మనుషుల్లానే నెత్తి మీద ఉన్న ఆకాశం నటిస్తోంది.జీవామృతధారలను ఇ వ్వడం మరిచిపోయింది.ఈ సారి కూడా దిగులు ఇంకొంచెం రెట్టింపు అయ్యేలా నే ఉంది.చావును వరంగా ఇచ్చిన ఏ సందర్భం మళ్లీ ఎందుకనో కారణం చెప్ప క పోతోంది.
“చుక్కలు కలిస్తే జాతకం
చుక్కలు విడిపోతే ఫలితం”
అయినా ఇవన్నీ ఒకరు చెబితేనే నేర్చుకున్నాను
మనుషులకూ గొడ్డు మోతు మేఘాలకూ మధ్య కుదరని పొంతన దగ్గర చుక్క లు తేలిపోతున్నాయి. రాత్రిళ్లు అపరాధ భావనలో కొట్టుకుపోతున్నాయి.కొట్టు కుపోయిన చీకటి ఓ చోట ఆగిపోయి వింతగా ఉంటోంది. వెలుగులో లేని మజా చీకటి అందిస్తోంది.మిగతా విషయాలు హాయిగా చదువుకునేంత సులు వుగా లేవు.భూమ్మీద జలచరాల నడక మీద గాలి పోగేసుకున్న ధూళి మేఘాల మీద ఇంత చర్చ జరగడం లేదు.ఇదిగో దూరంగా ఉన్నవాటిపై ఉన్నఅంచనా లను సైన్స్ చెప్పానని సంబరపడిపోతోంది.సంభవమేనా..ఇంకా ఈ వేసవికి కొ నసాగింపు ఇచ్చిన ఈ కాలాన్ని నమ్మేదెలా అని? ప‌్రభుత్వాలకూ ప్రజలకూ పొంతన కుదర్చని ఓ వార్త ఏదీ మనస్సులను కదిలించడం లేదు.ఈ సారి కూ డా మేఘాలు ముఖం చాటేస్తే నేల చావిళ్లలో పస్తుల పరంపరే పరమావధి అ యితే ఈ చావును ఆకలి విదిల్చిన శాపం అని అనొచ్చో లేదో తెలియకుంది.
రత్నకిశోర్ శంభుమహంతి