వయస్సు పెరిగే కొద్ది మానవ శరీరంలో అనేక కీలక మార్పులు రావడం సహజం..ముఖ్యంగా శృంగార లో వయస్సు పెరిగితే నా వల్ల కాదు బాబొయ్ అంటూ నిరాశ పరుస్తున్నారు.అంగం స్తంభించడంలోనూ లోపాలు కనిపిస్తూ ఉంటాయి. మహిళల్లో అయితే యోని పొడిగా మారుతుంది. కీళ్ల నొప్పుల్లాంటివి ఇబ్బంది పెడతాయి. అలాగే సెక్స్ పట్ల కోరిక తగ్గుతుంది.
అయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మీరు మీ జీవితాంతం చురుకైన లైంగిక జీవితాన్ని గడపవచ్చు. వ్యాయామం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు లైంగిక జీవితం కూడా ఆనందంగా సాగుతుంది. మీ రోజువారీ డైట్ ప్లాన్‌లో కొన్ని పానీయాలను చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు శృంగారం పట్ల ఆసక్తిని, సెక్స్ స్టామినాను పెంచుకోవచ్చు.అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గ్రీన్ టీ
గ్రీన్ టీ బరువు తగ్గడానికి ఒక అద్భుత పానీయం మాత్రమే కాదు, మీ లైంగిక కోరికను కూడా పెంచే మహాద్ఫుత డ్రింక్. గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే రిచ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఇది సెక్స్ డ్రైవ్‌ను పెంచడానికి సహాయపడుతుంది.
బ్లాక్ కాఫీ
మనందరికీ తెలిసినట్లుగా, మానసిక స్థితిని కాఫీ మెరుగుపరుస్తుంది. కాఫీలోని కెఫిన్ పురుషులు, మహిళలు ఇద్దరిలో సెక్స్ డ్రైవ్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. హ్యూస్టన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ 2015లో జరిపిన అధ్యయనం ప్రకారం, ప్రతి రోజూ కాఫీ తాగే పురుషులు, అంగస్తంభన సమస్యలు ఎదుర్కొనే అవకాశం చాలా చాలా తక్కువ అని తేలింది.
రెడ్ వైన్
ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ వైన్ పురుషులు, స్త్రీలలో లైంగిక ప్రేరేపణను పెంచుతుందని పేర్కొంది. రెండు గ్లాసుల రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మహిళల్లో సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది. పురుషులలో, రెడ్ వైన్ టెస్టోస్టెరాన్ను పెంచుతుంది. అతిగా సేవించడం వల్ల దుష్ప్రభవాలు ఉంటాయని గుర్తించుకోవాలి..
దానిమ్మ రసం
పురుషుల్లోనూ, స్త్రీల్లోనూ లైంగిక హార్మోన్లను పెంచడంలో దానిమ్మ రసం చాలా మంచి ఫలితాన్ని చూపిస్తుంది. USలోని బెవర్లీ హిల్స్ క్లినిక్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంపోటెన్స్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం, దానిమ్మ రసం తీసుకోవడం వల్ల లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ పెరుగుతుందని గమనించారు. తాజా దానిమ్మలతో చేసిన జ్యూస్ లను తాగడం మంచిది..
ఇక ఇవే కాదు బనాన షేక్,కలబంద జ్యూస్,పుచకాయ జ్యూస్ ను కూడా తీసుకోవడం వల్ల మంచి శక్తీ,రతి లో చురుగ్గా పాల్గొంటారు..ఇది గుర్తుంచుకోండి…