దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏలూరులోని క్రాంతి కల్యాణ మండపంలో వివిధ వర్గాల ప్రతినిధులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. జనసేన పార్టీ వ్యూహాప్రతివ్యూహాలపై చర్చిస్తున్న సందర్భంలో.. . హమాలీ జాన్‌పై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిని ఎస్సీ సంఘాలు పవన్‌కు వివరించాయి. దీనిపై స్పందించిన పవన్ హమాలీపై ఎమ్మెల్యే చింతమనేని దాడిని తీవ్రంగా ఖండించారు. చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారన్నారు. పాతికకు పైగా కేసులున్న చింతమనేనిపై ముఖ్యమంత్రి ఊదాసీనత చూపడాన్ని ఆయన తప్పుపట్టారు. చింతమనేనిని ముఖ్యమంత్రి అదుపు చేయకపోతే ప్రజలే ఆపని చేస్తారని హెచ్చరించారు. సమావేశంలో పాస్టర్ల సంఘం, హమాలీ సంఘం, రెల్లీ సంక్షేమ సంఘం, దివ్యాంగుల సంక్షేమ సంఘం, పామాయిల్, కొబ్బరి, నిమ్మ రైతు సంఘం సభ్యులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు. రాష్ట్రంలో రౌడీషీటర్లు, బడా కాంట్రాక్టర్లు, దోపిడీదారులు రాజ్యమేలుతున్నారని ఆయన పేర్కొన్నారు.