వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా ఓటమి అనంతరం కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మరో సమరానికి రెడీ అయింది. కానీ ప్రత్యర్థి ఒకరే అయినా, ప్లేయర్లు కొంతమంది మారుతుండడం ఒక్కటే తేడా అని చెప్పాలి. ఇండియా జట్టులో ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ మరియు ప్రసిద్ధ కృష్ణలు మాత్రమే వరల్డ్ కప్ లో ఉన్నారు. మిగిలిన వారంతా కుర్రాళ్లే కావడం గమనార్హం. ఇక ఈ టీం ను టీ 20 స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న సూర్య ముందుండి జట్టును నడిపించనున్నాడు. ఇక కెరీర్ లో సూర్య కుమార్ యాదవ్ జాతీయ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు అందుకోవడం మొదటిసారి కావడంతో ఇది ఒక ఛాలెంజ్ అని చెప్పాలి. వరల్డ్ కప్ లో విఫలం కావడంతో ఇప్పుడు సూర్య పై రెండు బాధ్యతలు ఉన్నాయి.
ఒకటి బ్యాట్స్మన్ గా రాణించడంతో పాటు కెప్టెన్ గా కూడా జట్టును గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉంది. మరి సూర్యకు కెరీర్ లో దక్కిన కెప్టెన్సీ అనే పరీక్షలో నెగ్గుతాడా అన్నది చూడాలి.