కాంగ్రెస్‌నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసు జారీ చేసింది. కాంగ్రెస్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీలపై రాజగోపాల్‌రెడ్డితో పాటు కొందరు సీనియర్ నేతలు బహిరంగంగా విమర్శలు చేయడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.
హైదరాబాద్ శివారు పెద్దఅంబర్‌పేటలో గురువారం జరిగిన మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు కుంతియా శనిలా దాపరించాడని.. గాంధీభవన్‌లో ప్రెస్మీట్లు పెడితే పార్టీ అధికారంలోకి రాదంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేకుండా పోతోందని, కమిటీల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఎవరికి బలముందో తెలుసుకోవాలని, పైరవీకారులకు టిక్కెట్లు ఇచ్చుకుంటూ పోతే పార్టీ ఎన్నికల్లో గెలవదన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే 2014 ఫలితాలు పునరావృతం కాకతప్పదని.. ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నా..అధిష్ఠానం మాత్రం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే…