గంగమ్మ ఒడికి చేరిన గణపతి

-

ఖైరతాబాద్‌ శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి కొద్ది సేపటి క్రితమే గంగమ్మ ఒడికి చేరాడు. ఆదివారం ఉదయం 8గంటలకే ప్రారంభమైన శోభాయాత్ర 11గంటలకే ట్యాంక్ బండ్ పై చేరింది. నిమజ్జనానికి అనువైన ప్రదేశం వద్దకు చేరుకున్న  విఘ్నేశ్వరునికి అర్చకులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. 400 టన్నుల సామర్థ్యమున్న క్రేన్‌ సాయంతో మహాగణపతిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. ఈ మహత్తర కార్యక్రమాన్న తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు జనసంద్రంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version