జమిలి ఎన్నికల పై 5000 సూచనలు…..

-

ఒకే దేశం – ఒకే ఎన్నిక పై అధ్యయనానికి కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించే క్రమంలో ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. వేలాది మంది ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు 5వేలకు పైగా ఈ-మెయిళ్లు వచ్చినట్లు తెలిపింది.

 

 

దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేలా.. ప్రస్తుతం ఉన్న చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్లో తగిన మార్పులను ప్రజలు జనవరి 15లోగా సలహాలు, సూచనలు పంపవచ్చని వెల్లడించింది. ఈ సూచనలను కమిటీ వెబ్సైట్ onoe.gov.inలో పోస్ట్ చేయాలని లేకపోతే sc-hlc@gov.in ఐడీకి ఈ-మెయిల్ చేయాలని తెలిపింది.ఒకే దేశం- ఒకే ఎన్నిక కోసం గతేడాది సెప్టెంబరులో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2 సార్లు సమావేశాలు నిర్వహించింది. ఇటీవల జమిలి ఎన్నికలపై 6 జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలను కోరింది .అలాగేన్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version