ఇటీవల పార్లమెంటులో జరిగిన భద్రత ఉల్లంఘన ఘటనలో కేంద్ర హోం శాఖ మంత్రి ప్రకటన విడుదల చేయకపోవడంతో రాజ్యసభ ,లోక్సభలోని ఎంపీలు సభకు ఆటంకం కలుగజేస్తున్నారు.దీనితో స్పీకర్ వారిని సస్పెండ్ చేస్తూ ఉన్నాడు. ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ వేటుని నిరసిస్తూ ఇండియా కూటమి హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఆరోపించారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని సూచించారు.
నియంతృత్వ పోకడలతో ప్రధాని మోడీ నాయకత్వం కొనసాగుతుందని అన్నారు. అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని…. ఒకవేళ ప్రశ్నిస్తే అరెస్టు చేయడం తప్పు అని అన్నారు. పార్లమెంటుని రక్షించలేని ప్రభుత్వం దేశాన్ని ఎలా రక్షిస్తుందని ఆయన అన్నారు.