నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా..? వీటిని తినండి నీరసం రాదు

-

నవరాత్రి వస్తోంది.. పండుగలు వస్తున్నాయంటే.. ముందు ఎలాంటి నైవేద్యం పెట్టాలని ఇంట్లో ఆడవాళ్లు ఆలోచిస్తారు. కొంతమంది ఆ తొమ్మిది రోజులు ఉపవాసం కూడా ఉంటారు. రోజంతా ఏమీ తినకపోతే కళ్లు తిరుగుతాయి, నీరసం అయిపోతారు. అందుకే అందుకే కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే.. నిరసం రాకుండా ఉంటుంది. అలా అయితేనే 9 రోజులపాటు మీరు దుర్గాదేవికి పూజలు చేస్తూ ఉపవాసం ఉండొచ్చు. నవరాత్రుల్లో ఎలాంటి ఆహారం తినాలంటే..

సాబుదానాను నవరాత్రి వేళల్లో తీసుకోవచ్చు. ఇది కార్బోహైడ్రేట్ల యొక్క మంచి మూలం.. శక్తి వస్తుంది. ఉపవాసం సమయంలో వెంటనే శక్తిని పెంచుకునేందుకు ఇది అనువైనది. సాబుదానా గ్లూటెన్-రహితంగా ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి లేదా అనారోగ్యం సమయంలో
ఇది తింటే తేలికగా జీర్ణమవుతుంది. ఇది కొవ్వు రహితమైనది. ఉపవాసం సమయంలో మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుంది. ఉపవాస సమయంలో వేరుశెనగలు, కూరగాయలు, వంటి ఇతర పదార్ధాలను జోడించి సాబుదానాను తీసుకోవచ్చు. ఖిచ్డీ, వడలు చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు.

ఉపవాస వేళ.. మంచి రుచిని ఆస్వాదించాలనుకుంటే.. కచ్చితంగా చిలకడదుంపను తీసుకోండి. శరీరంలో డీ హైడ్రేషన్ తొలగించే శక్తి చిలకడదుంపకు ఉంటుంది. దీనిలో పొటాషియం, సోడియం, కాల్షియం లాంటి మూలకాలు ఉంటాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రోగ నిరోధకశక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది.

బుక్వీట్‌ పిండి సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. బుక్వీట్ పిండి.. పండ్ల విత్తనం నుంచి తయారుచేస్తారు. అందుకే ఉపవాసం సమయంలో దీనిని తింటారు. ఈ పిండి రుచికి బాగుంటుంది. ఉపవాససమయంలో ఈ పిండితో వంటకాలను తయారు చేయడం మంచి ఎంపిక. ఈ పోషకాలు అధికంగా ఉండే పిండిలో అవసరమైన విటమిన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా పేగు కదలికలను ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందింది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది, మధుమేహం ఉన్నవారికి సరైన ఎంపిక.

తామర గింజలు కూడా ఉపవాసం సమయంలో తీసుకోవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ గింజల్లో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు వంటి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి తామర గింజలు ఉపయోగపడతాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లకు కూడా మంచి మూలం. ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో తక్కువ సోడియం కంటెంట్ గుండె సంబంధిత రోగులకు ఆరోగ్యకరమైన ఎంపికగా పని చేస్తుంది.

ఉపవాసంలో ఉన్నప్పుడు ఇలాంటివి తింటే.. బాడీకి పోషకాలు అంది.. యాక్టివ్‌గా ఉండొచ్చు. ఇప్పుడే అన్ని తెచ్చి పెట్టుకోండి మరీ.।!

Read more RELATED
Recommended to you

Exit mobile version